Ads
సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన చిత్రం పుష్ప: ది రైజ్. ఈ పాన్ ఇండియా చిత్రం దేశం మొత్తాన్ని షేక్ చేసింది. విడుదల అయినపుడు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఓవరాల్ గా చూసుకుంటే సూపర్ హిట్ అయ్యింది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నట్లు మొదట్లోనే ప్రకటించారు మేకర్స్.
Video Advertisement
ఇందులో మొదటి దాన్ని పుష్ప : ది రైజ్ పేరుతో విడుదల చేయగా, రెండో దాన్ని పుష్ప: ది రూల్ పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో పుష్ప రూలర్ గా ఎలా మారాడు అన్న విషయాన్నీ చూపించనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకం గా రానున్న ఈ రెండో భాగం లో పలువురు స్టార్లను సుకుమార్ భాగం చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చి ఏడాది గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు రెండో భాగం గురించి చిన్న అప్డేట్ కూడా రాలేదు.
అయితే ప్రస్తుతం పుష్ప : ది రైజ్ ని వివిధ దేశాల్లో విడుదల చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రాన్ని రష్యా లో విడుదల చేసారు. దీని కోసం చిత్ర బృందం రష్యా వెళ్లి ప్రమోషన్స్ చేసింది. అక్కడ కూడా మంచి కలెక్షన్లు రాబడుతోంది ఈ చిత్రం.
ఇక ‘పుష్ప: ది రైజ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ‘పుష్ప: ది రూల్’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమాను రూపొందించేందుకు దర్శకుడు సుకుమార్ కష్టపడుతున్నారు. ఇప్పటికే ‘పుష్ప 2’ షూటింగ్ మొదలుపెట్టారు. రామోజీ ఫిలిం సిటీలో ఒక సెట్ వేసి అందులో షూటింగ్ పూర్తిచేస్తున్నట్టు సమాచారం. ‘పుష్ప’కు మించి ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్నారు.
అయితే పుష్ప : ది రైజ్ విడుదల అయ్యి ఏడాది అయినా.. రెండో భాగం గురించి ఒక్క అప్డేట్ కూడా లేకపోవడం పై బన్నీ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. అప్డేట్ కావాలంటూ నెట్టింట డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఒక లుక్ వేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
End of Article