“చాలా బాగున్నావ్… పెళ్లి చేసుకుందామా..?” అంటూ వల వేసింది..! తర్వాత ఏమైందంటే..?

“చాలా బాగున్నావ్… పెళ్లి చేసుకుందామా..?” అంటూ వల వేసింది..! తర్వాత ఏమైందంటే..?

by Anudeep

Ads

ప్రస్తుత కాలం లో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ పెరిగే కొద్దీ.. మోసాలు కూడా పెరుగుతున్నాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా సరే.. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మోసాలు చేసే వారికి అంత అవకాశం ఇచ్చిన వారు అవుతారు. వివిధ సోషల్ మీడియా ప్లాటుఫార్మ్ లలో పరిచయం అయిన వారిని నమ్మి.. డబ్బులు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు.

Video Advertisement

 

ఈ నేపథ్యం లో తాజాగా ఒక సంఘటన జరిగింది. పెళ్లి చేసుకుంటా అని నమ్మించి ఏకంగా 30 లక్షల రూపాయలకు పైగా లూటీ చేసింది ఒక కిలాడీ లేడీ. తనను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి 8 నెలల కాలం లో 30 లక్షలు దోచుకుందని.. ఒక యువకుడు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. రంగం లోకి దిగిన పోలీసుల దర్యాప్తుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

girl cheated several people on instagram..

మచిలీపట్నానికి చెందిన పరసా తను శ్రీ సోషల్ మీడియా లో రీల్స్, వీడియోస్ చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. ఈమెకు ఇంస్టాగ్రామ్ లో నాలుగు అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ ని చాలా మంది ఫాలో అవుతున్నారు. తన వీడియోల కింద కామెంట్స్ పెట్టేవారికి పర్సనల్ గా మెసేజ్ లు పెట్టి వారిని ట్రాప్ చేసింది తను శ్రీ . ఒక వ్యక్తి తో సహజీవనం చేస్తున్న తను శ్రీ.. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడింది. అతడి సహాయం తో పలువురిని మోసం చేసింది. అలా హైదరాబాద్ కి చెందిన ఒక యువకుడితో 8 నెలలుగా పరిచయం పెంచుకుంది. తన తల్లికి అనారోగ్యమంటూ పలు సమయాల్లో ఆ యువకుడి దగ్గరి నుంచి డబ్బులు తీసుకుంది.

girl cheated several people on instagram..

31 లక్షల 66 వేలు ఆమెకు ఇచ్చిన తర్వాత.. ఆమెది మోసం అని తెలుసుకున్న ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసారు పోలీసులు. తను శ్రీ ని, ఆమెకు సహకరిస్తున్న శ్రీకాంత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి చాలా మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


End of Article

You may also like