Ads
ప్రతి స్త్రీ కూడా జీవితంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటుంది. ఏ చిన్న పని చేయడానికి అయినా సరే స్వేచ్ఛ ఉండదు. ఏదైనా సాధించాలంటే కూడా సాధించడానికి కుదరదు.
Video Advertisement
తన కలల్ని, ఆశలని, ఆశయాలని అక్కడితో ఆపేసుకోవాలి. పైకి చెప్పడానికి కూడా లేని దుస్థితి వస్తుంది.
అమ్మానాన్నలు ఇలా…
పుట్టినప్పటి నుండి కూడా ఇదే తంతు. పుట్టిన తర్వాత అమ్మ మాట నాన్న మాట వినాలి… ఒకవేళ బయటకు వెళ్లాలంటే ఎవరినైనా తోడుగా తీసుకుని వెళ్లాలి. నలుగురిలో మాట్లాడటానికి కానీ నలుగురు మధ్య నవ్వడానికి కానీ అవకాశం లేదు సరి కదా చెప్పాలనుకున్న మాటలను కూడా గొంతులోనే ఆపేసుకోవాల్సిన దుస్థితి వారిది. పైగా ఆమె చదువుకోకూడదని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. ఎవరో ఒకరికి కట్టబెడితే వాళ్లే పోషిస్తారని చదువుని కూడా ఆపేస్తూ ఉంటారు.
పెళ్లి తర్వాత అత్తామామలు అలా…
పెళ్లి తరవాత ఏదో అదృష్టం వచ్చేస్తుందని అనుకోవద్దు. పెళ్లి తర్వాత పుట్టింట్లో ఉన్న స్వేచ్ఛ కూడా ఉండదు. బాధలే తప్ప ఆనందాలు తక్కువ. తర్వాత పిల్లల్ని కనడం అలానే అత్తమామలు ఆడపడుచులతో సరిపోతుంది.
ఇక వారి కోరికలకి రోజులేవి..?
ప్రతిరోజు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది పాటించడం తప్ప తను అనుకున్నది చేయడానికి వీలు లేకపోయింది. అయితే ఇలా సమస్యలను ఎదుర్కోలేక చాలా మంది మహిళలు ఒంటరి జీవనాన్ని గడుపుతున్నారు. ఏ అర్థం లేకుండా జీవితం ముగిసిపోతుంది. కానీ ఇలాంటి వారు కౌన్సిలింగ్ కి వెళ్లడం మంచిది.
భయంకరమైన ఇబ్బందులు కూడా…
కొందరు స్త్రీలైతే వరకట్న వేధింపులు వంటి వాటిని భరించలేక మరణమే మేలని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. నిజానికి చాలా మంది మహిళలు చస్తూ బతుకుతున్నారు. కానీ స్వచ్చంద సంస్థలు వున్నాయి. అలానే ఇలాంటి జీవితం నుండి బయటకి వచ్చేసి మహిళలు అనుకున్న దారి లో వెళ్తే సమస్యలకి దూరంగా ఉండచ్చు. నచ్చినది చెయ్యచ్చు. అనుకున్నది సాధించచ్చు. ఇప్పటికైనా మేల్కొని మీరు అనుకున్నది అందుకోండి.
End of Article