Ads
దళపతి విజయ్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘వారిసు’. ఈ చిత్రం తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రం తో తమిళం లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు వంశీ పైడిపల్లి. నిర్మాత దిల్ రాజుకు కూడా తమిళ్‌లో ఇదే ఫస్ట్ ఫిల్మ్. ఇన్ని స్పెషాలిటీస్ ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి.
Video Advertisement
ఇటీవలే విడుదలైన పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. వారిసు రిలీజ్ పై ఒక వైపు వివాదాలు చుట్టుముడుతున్నా .. మరో వైపు అంచనాలు పెరిగిపోతున్నాయి. వారసుడు ఇన్సైడ్ రిపోర్ట్ అంటూ ఒక రివ్యూ వైరల్ అవుతోంది. వారసుడు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ పవర్ టాకీస్ పేరుతో ఒక ట్వీట్ వైరల్ అవుతోంది.
తమిళ హీరో విజయ్ తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అని రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అతని గత సినిమాలు తెలుగు మార్కెట్లో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. తమిళ ఇండస్ట్రీలో అత్యధిక మార్కెట్ తో కొనసాగుతున్న విజయ్ ఇప్పుడు వారసుడు సినిమాతో కూడా ఊహించని స్థాయిలో బిజినెస్ క్రియేట్ చేశాడు. అలాగే ఈ చిత్రం విజయ్ కెరీర్ లోనే అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా కోసమే అతను 90 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నాడు. విజయ్ కెరీర్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక పారితోషికం కావడం విశేషం. వారసుడు సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది అని దిల్ రాజు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యింది. దీనిపై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :
End of Article