Ads
రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పటివరకు బాలయ్య నటించిన సినిమాలు అన్ని సువర్ హిట్స్ అన్న విషయం తెల్సిందే. ఇప్పుడు తనకు కలిసొచ్చిన అదే జోనర్ లో సంక్రాంతి బరిలో నిలిచారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ పోషించిన ‘వీరసింహా రెడ్డి’ మూవీ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణకి జోడీగా శృతి హాసన్ నటించింది. అలానే విలన్‌గా కన్నడ నటుడు దునియా విజయ్ నటించాడు.
Video Advertisement
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్స్‌తో సినిమాపై అంచనాలు పతాక స్థాయికి చేరాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఒంగోలులోని త్రోవ గుంట సమీపంలో ఉన్న అర్జున్ ఇన్‌ఫ్రాలో శుక్రవారం జరిగింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించింది. దాంతో ఈ ఈవెంట్‌లోనే ట్రైలర్‌ని సరిగ్గా రాత్రి 8:17 నిమిషాలకి రిలీజ్ చేసారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించిన విషయం తెలిసిందే.
నందమూరి బాలకృష్ణ హీరోగా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలు చాలా వరకూ హిట్ అయ్యాయి. దాంతో ఈ సినిమాపై కూడా చిత్ర యూనిట్ పూర్తి విశ్వాసంతో ఉంది. వీరసింహా రెడ్డి టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఒంగోలులోనే నిర్వహించాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో ఇప్పటికే పలు పాటలను విడుదల చేసారు. ఈ సినిమా నుంచి ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే జై బాలయ్య అంటూ ఓ పాట విడుదలవ్వగా ఇక లేటెస్ట్‌గా రెండో సింగిల్ సుగుణ సుందరి లిరికల్ సింగిల్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అలాగే మా బావ మనోభావాలు అని సాగే ప్రత్యేక గీతం కూడా రిలీజ్ చేయగా ఈ సాంగ్స్ అన్ని ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ రిలీజ్ అయిన ట్రైలర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :
End of Article