“హీరో అబ్బాస్” కుమార్తెని చూసారా..?? అచ్చం హీరోయిన్ లా ఉంది కదా..!!

“హీరో అబ్బాస్” కుమార్తెని చూసారా..?? అచ్చం హీరోయిన్ లా ఉంది కదా..!!

by Anudeep

Ads

కొంతమంది హీరోలను చూడగానే లవర్ బాయ్ ట్యాగ్ ఇచ్చేయాలని అనిపించేస్తుంది. అలాంటి హీరోలలో అబ్బాస్ ఒకరు. అవును.. అబ్బాస్ లవర్ బాయ్ గా పాపులర్ అయ్యాడు. ఆ ఇమేజ్ కోసం అతను ట్రై చేయలేదు. ప్రేక్షకులే అబ్బాస్ కి లవర్ బాయ్, హ్యాండ్సమ్ అంటూ కితాబులు ఇచ్చేశారు. అలా ఒకప్పుడు లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసు దోచేసిన అబ్బాస్ తమిళ్ సినిమాలతో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవ్వడంతో అతనికి ఇక్కడ కూడా క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Video Advertisement

 

 

అప్పట్లో అబ్బాస్ కు హ్యాండ్సమ్ హీరోగా మంచి గుర్తింపు ఉండేది. వెస్ట్ బెంగాల్ లో పుట్టిన అబ్బాస్.. తమిళంలో హీరోగా మంచి పేరు సంపాదించుకోవడం విశేషం. అలాగే తెలుగులోనూ చాలా సినిమాలు చేసి అలరించాడు అబ్బాస్. అప్పటివరకూ మోడలింగ్ లో బిజీ అయిన అబ్బాస్.. ప్రేమదేశం సినిమాతో సినిమాల్లో డెబ్యూ చేశాడు. తొలి సినిమాతోనే ఇండియన్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టి, అందరి దృష్టిని ఆకర్షించాడు అబ్బాస్. అయితే గత కొంతకాలంగా అబ్బాస్ సినిమాలకు దూరం గా ఉంటున్నారు. అబ్బాస్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో స్థిరపడిపోయారు.

know about actor abbas family..!!

అబ్బాస్ గురించి చాలా మందికి తెలుసు కానీ అతడి భార్య బిడ్డల గురించి చాలా మందికి తెలీదు. అబ్బాస్ బాలీవుడ్ నటి, ఫాషన్ డిజైనర్ ఇరుము ఆలీ ని వివాహం చేసుకున్నారు. ఆమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అంతేకాకుండా అబ్బాస్ నటించిన ప్రతి సినిమాకు ఈమె ఫ్యాషన్ డిజైనర్ గా చేసింది. అలాగే అబ్బాస్ కి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు ఏమిరా అలీ. అబ్బాస్ కూతురు ఏమిరా చాలా అందం గా ఉన్నారు. ఆమె అందానికి స్టార్ హీరోయిన్స్ కూడా సరిపోరు. సోషల్ మీడియాలో అబ్బాస్ కూతురు ఏమిరా అలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

 

know about actor abbas family..!!
న్యూజిలాండ్ లో స్థిరపడిపోయి అక్కడ బాగా సంపాదిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అబ్బాస్ తన అభిమానులకు తెలియజేశారు. పెళ్లి తర్వాత చాలా కాలంగా మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్న అబ్బాస్ ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను ఈ మధ్య కాలంలో షేర్ చేశాడు. దీంతో అతడి కుమార్తె ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ అమ్మాయి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెడితే కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయిపోతుంది అని అనుకుంటున్నారు అబ్బాస్ ఫాన్స్.


End of Article

You may also like