Ads
బాల్య వివాహాలు చాలా చోట్ల నిషేధించినా కూడా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. అలా తనకి జరిగిన బాల్య వివాహాన్ని ఒక యువతి ఎంతో కష్టపడి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. వివరాల్లోకి వెళితే. సుశీల బిష్ణోయ్ రాజస్థాన్ కి చెందిన యువతి. సుశీలకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు తన కంటే ఆరు సంవత్సరాలు పెద్దయిన నరేష్ తో పెళ్లి చేశారు.
Video Advertisement
రాజస్థాన్ లో బాల్య వివాహం జరిగిన తర్వాత ఆ యువతికి 18 సంవత్సరాలు వచ్చేంతవరకు తన పుట్టింట్లోనే ఉంటుంది. సుశీలకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు తనని అత్తవారింటికి వెళ్ళమని ఒత్తిడి చేశారు. ఏప్రిల్ 2016 లో సుశీల తన అత్తవారింటి నుండి బయటికి వచ్చేసింది.
బాల్య వివాహాల్లో నుండి బయటకి రావడానికి యువతులకు సహాయం చేసే సారథి ట్రస్ట్ అనే ఒక ఎన్జీవో ని నడుపుతున్న క్రితి భారతిని కలిసింది. భారతి, సుశీల నివసించే చోట ఉండే చుట్టుపక్కల వాళ్ళని, బంధువులని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమని కోరారు. కానీ సాక్ష్యం చెప్పడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అప్పుడు నరేష్ ఫేస్ బుక్ అకౌంట్ టైం లైన్ లో వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఫొటోలు ఉన్నాయి.
వాటిని కోర్టులో ఆధారాలుగా సబ్మిట్ చేశారు. 2017 సెప్టెంబర్ 25 వ తేదీన జోధ్ పూర్ కోర్ట్ వీళ్ళ పెళ్లిని రద్దు చేసింది. తర్వాత సుశీల నేషనల్ ఓపెన్ స్కూల్ సిస్టం లో 12వ తరగతి పరీక్షలను రాసి 62 శాతం స్కోర్ చేసింది. బాగా చదివి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అనేది తన ఆశయం అని చెప్పింది సుశీల.
End of Article