“వీర సింహా రెడ్డి” సినిమా నెగెటివ్ టాక్‌కి… ఈ 4 విషయాలే కారణం అయ్యాయా..?

“వీర సింహా రెడ్డి” సినిమా నెగెటివ్ టాక్‌కి… ఈ 4 విషయాలే కారణం అయ్యాయా..?

by Mohana Priya

Ads

ఎంతో ఎదురు చూసిన తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు. ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాగా రూపొందింది. ఇందులో బాలకృష్ణతో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు.

Video Advertisement

ఎంతోమంది ప్రముఖ నటినటులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. సినిమా విడుదల అయ్యే ముందు నుండి కూడా సినిమా ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూశారు. కానీ సినిమా విడుదల అయిన తర్వాత చూస్తే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది.

ramajogayya sastri in veerasimha reddy cameo..!!

కొంత మంది సినిమా చాలా బాగుంది అంటే, మరి కొంతమంది మాత్రం, “చాలా రొటీన్ స్టోరీ. ఇలాంటి సినిమాలు మనం అంతకుముందు ముందు చాలా చూసాం” అని అంటున్నారు. కొంతమంది అయితే ఏదో ఒక్కసారి చూడగలిగే సినిమా అని అంటున్నారు. కానీ బాగా ఆశలు పెట్టుకుని వెళ్ళిన వారిని నిరాశపరిచింది అని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ సినిమా నెగిటివ్ టాక్ కి కారణాలు అయిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

veera simha reddy movie review

#1 బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో తండ్రి కొడుకులుగా నటించిన సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఒకవేళ తండ్రి కొడుకులుగా బాలకృష్ణని చూపించాలి అనుకుంటే యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో కాకుండా ఇంకా ఏమైనా కాన్సెప్ట్ ఎంచుకుంటే బాగుండేది అని అంటున్నారు. ఎందుకంటే దాదాపు ఇలాంటి స్టోరీతోనే చెన్నకేశవరెడ్డి సినిమా వచ్చింది. అందులో కూడా పెద్ద బాలకృష్ణ పాత్ర కొంచెం ఇలాగే ఉంటుంది అని అంటున్నారు.

'veera simha reddy'. is going to be a block buster.. inside talk..

#2 బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా కూడా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా. దాని తర్వాత వచ్చిన సినిమా కూడా అలాంటి సినిమానే. దాంతో వరుసగా అలాంటి సినిమాలు చేయడం ఎందుకు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. కొన్ని సీన్స్ కూడా ఆ సినిమా గుర్తు తెచ్చేలాగా ఉన్నాయి అని అంటున్నారు.

memes on veera simha reddy song..

#3 ఫైటింగ్ సీన్స్ లో అయితే లాజిక్ కూడా లేదు అనే కామెంట్స్ వస్తున్నాయి. అందులోనూ ముఖ్యంగా వీర సింహా రెడ్డి పాత్ర పోషించిన బాలకృష్ణ ఎదురుగా వస్తున్న ఒక జీప్ ని కాలితో తన్నగానే ఆ జీప్ ఆగుతుంది. అసలు ఆ ఫైట్ చూసిన వాళ్లు, “లాజిక్ లేకుండా ఇలాంటి ఫైట్స్ ఎలా చేస్తారు?” అని అంటున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం ఇలాంటివి అన్ని పట్టించుకోకుండా సినిమాని సినిమాలాగా చూడాలి అని అంటున్నారు.

reasons for veera simha reddy negative talk

#4 అసలు శృతి హాసన్ కి, బాలకృష్ణకి పెయిర్ కూడా అస్సలు సూట్ అవ్వలేదు అని అంటున్నారు. ఇద్దరు హీరో హీరోయిన్లుగా చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నారు అని, వారిద్దరికీ మధ్య కెమిస్ట్రీ కూడా తెరపై బాగా కనిపించలేదు అని అంటున్నారు. అలాగే శృతి హాసన్ తో వచ్చే కామెడీ ట్రాక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. అసలు కొంత మంది అయితే హీరోయిన్ పాత్ర లేకపోయినా సినిమాకి పెద్దగా తేడా ఏమీ ఉండదేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

veerasimha reddy inside talk..!!

ప్రస్తుతం అయితే వీర సింహా రెడ్డి సినిమా థియేటర్లలో నడుస్తోంది. సినిమా టాక్ కూడా యావరేజ్ గా వస్తోంది. అభిమానులకి నచ్చినా కూడా, సాధారణ ప్రేక్షకులకు సినిమా రొటీన్ గా అనిపిస్తుంది అని అంటున్నారు.


End of Article

You may also like