Ads
సాధారణంగా పెద్ద హీరోల సినిమా అంటేనే ఒక పండగ లాగా ఉంటుంది. అలాంటిది ఒకటి కాదు ఏకంగా రెండు పెద్ద హీరోల సినిమాలు విడుదల అయితే ఇంక సెలబ్రేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
టాక్ తో సంబంధం లేకుండా ఆ హీరోల సినిమా విడుదల అయితే చాలు అని అనుకుంటారు. వారి సినిమా విడుదల అవ్వడమే చాలా పెద్ద విషయం అనుకుంటారు. ఈసారి కూడా అలాగే జరిగింది. బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి, చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదల అయ్యాయి. రెండు సినిమాల్లో స్టోరీ పరంగా పెద్దగా చెప్పుకోవడానికి ఏదీ లేదు.
కానీ ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అంశాలు అన్నీ కూడా ఈ రెండు సినిమాల్లో చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ప్రేక్షకులు సినిమా నుండి కొత్తదనం, లేదా గొప్ప కథ ఏమీ ఆశించకపోయినా ఒక మంచి సినిమా చూసాం అని అనుకుని వెళ్తున్నారు. రెండు సినిమాలు కూడా టాక్ పరంగా రొటీన్ అని అంటున్నారు. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం కొద్ది రోజుల్లోనే చాలా ఎక్కువ రాబట్టాయి.
అయితే ఈ రెండు సినిమాల్లో కూడా ఒక సినిమాకి ఒకరకంగా కలెక్షన్లు ఉంటే, మరొక సినిమాకి ఇంకొక రకంగా కలెక్షన్లు ఉన్నాయి. అసలు విషయం ఏంటంటే, రెండు సినిమాలు ఒక్క రోజు తేడాతో విడుదల అయ్యాయి. ఈ రకంగా వీర సింహా రెడ్డి సినిమా ముందు వచ్చింది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం వీర సింహా రెడ్డి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 127.5 కోట్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ దాటి 1.79 కోట్ల ప్రాఫిట్ అందుకుంది.
అదే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఇప్పటికీ 125 కోట్లు వసూలు చేసింది. 36.04 కోట్ల లాభం కూడా అందుకుంది. ఇంక వీకెండ్ కావడంతో సినిమా కలెక్షన్లు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అలా రెండు సినిమాలని పోల్చి చూస్తే వాల్తేరు వీరయ్య సినిమాకి లాభాలు ఎక్కువగా వచ్చాయి అని అంటున్నారు.
అందుకు ముఖ్య కారణం చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో పాత్ర పరంగా కూడా ప్రేక్షకులని అలరించేలా రూపొందించారు. దాంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఇంకా ఎక్కువగా నచ్చింది. అందుకే కలెక్షన్లు కూడా అదే రకంగా వస్తున్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు. టాక్ పరంగా చూసుకుంటే వీర సింహా రెడ్డి హిట్ టాక్ అందుకుంది. వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
End of Article