Home Filmy Adda తమిళ్ స్టార్ విజయ్ “THALAPATHY 67” పోస్టర్‌లో… ఈ క్లూ గమనించారా..?

తమిళ్ స్టార్ విజయ్ “THALAPATHY 67” పోస్టర్‌లో… ఈ క్లూ గమనించారా..?

by Anudeep

కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు పేరుతో డబ్ అయ్యింది. దిల్ రాజు నిర్మాత, రష్మిక మందన్న హీరోయిన్. ఈ చిత్రం ఘానా విజయం సాధించింది. అయితే ఆ చిత్రం తర్వాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు విజయ్. మాస్టర్ చిత్రం తర్వాత కోలీవుడ్ స్టార్ విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం పై అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియో.

“మాస్టర్, వారిసు తర్వాత విజయ్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. తలపతి 37 కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 2 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ మనోజ్ పరమహంస అందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే అందిస్తాం.” అని నిర్మాణ సంస్థ 7 స్క్రీన్ స్టూడియో ఒక ప్రకటనలో వెల్లడించింది.

vijay-lokesh kangaraj next movie update..

 

మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రం కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో కార్తీ హీరోగా వచ్చిన ‘ఖైదీ’ చిత్రం, కమలహాసన్ హీరోగా వచ్చిన ‘ విక్రమ్’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు తలపతి తర్వాతి చిత్రం కూడా అందులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తలపతి 67 అని ఇచ్చిన పోస్టర్ లో ఎల్ సి యు (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) అన్న అక్షరాలు తిరగేసి రాసి ఉన్నాయి. దీంతో ఈ చిత్రం కూడా ఆ ఫ్రాంచైజ్ లో భాగమన్న విషయం ఫిక్స్ అయినట్టే అని ఫాన్స్ అనుకుంటున్నారు.

vijay-lokesh kangaraj next movie update..

వారసుడు చిత్రం పూర్తి కాగానే విజయ్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. చిత్రం లో విజయ్ టీ అమ్ముకొనే వ్యక్తిగా నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం లో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా త్రిష, గౌతమ్ మీనన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే మలయాళ నటుడు నివిన్ పోలీ ప్రతినాయకుడిగా నటిచనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ఈ ఏడాది దసరా లేదా దీపావళి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.

You may also like