Ads
ప్రయాణీకుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆయా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచాయని.. 2 కిలోమీటర్లకు రూ. 100 వసూలు చేస్తున్నాయంటూ రాష్ట్ర రవాణా శాఖకు భారీగా ఫిర్యాదులు అందటంతో.. కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు ఓలా, ఉబర్, ర్యాపిడోలకు నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం 2 కిలోమీటర్లకు కనీస ఆటో ఛార్జీని రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆ తర్వాత ప్రతీ కిలోమీటర్‌కు రూ.15 చొప్పున వసూలు చేయొచ్చునని పేర్కొంది. అయితే ఈ రైడ్ హెయిలింగ్ కంపెనీలు నిర్ణయించిన రేట్ల కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికారులకు ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి.
Video Advertisement
ఈ నేపథ్యం లో ‘ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు తమ ఆటో సర్వీసులను వీలైనంత త్వరగా నిలిపివేయాలి. అలాగే ట్యాక్సీలలో ప్రయాణీకుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీల కంటే అధికంగా వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని కర్ణాటక రవాణా శాఖ గతేడాది అక్టోబర్ లో హెచ్చరించింది. కర్ణాటక ఆన్-డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్, 2016 ప్రకారం కేవలం ట్యాక్సీలను మాత్రమే నడపడానికి అగ్రిగేటర్లకు లైసెన్స్ మంజూరు చేశామని రవాణా కమిషనర్ టిహెచ్ఎం కుమార్ తెలిపారు.
టాక్సీలు అనేవి డ్రైవర్ మినహాయించి ఆరుగురు ప్రయాణీకులు మించకుండా సీటింగ్ క్యాపాసిటీ కలిగిన మోటార్ క్యాబ్’.. వాటి లైసెన్స్‌లతో ఆటోలు నడుపుతున్నారంటే అగ్రిగేటర్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని అర్థం. అందుకే యాప్‌ల ద్వారా నడుపుతున్న ఆటో సర్వీసులను నిలిపేసి.. తమకు నివేదికను సమర్పించాలని కోరామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పౌరుల తరపున 292 కేసులను నమోదు చేసింది.
అధిక చార్జీలతో పాటు వేధింపులకు గురిచేయడం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రవాణా శాఖ.. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలను నడుపుతున్న ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలకు నోటీసులు జారీచేసింది. ఆటో రిక్షా సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే బెంగళూరులోని స్థానిక ఆటో డ్రైవర్లు కూడా తమ సొంత మొబైల్ అప్లికేషన్లను ప్రారంభించడం ద్వారా యాప్ ఆధారిత అగ్రిగేటర్లను ఎదుర్కోవాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత సర్వీస్ ఛార్జి ని 5 శాతానికి కుదిస్తూ ఈ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది.
source: https://www.instagram.com/reel/Cjsie47jHqV/?igshid=YmMyMTA2M2Y%3D
End of Article