Ads
- వెబ్ సిరీస్ : ఫర్జీ (అమెజాన్ ప్రైమ్)
- నటీనటులు : షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్, రాశి ఖన్నా.
- నిర్మాత : రాజ్ & డికె
- దర్శకత్వం : రాజ్ & డికె
- సంగీతం : కేతన్ సోధా, సచిన్-జిగర్, తనిష్క్ బాగ్చి
- విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2023
Video Advertisement
స్టోరీ :
సన్నీ (షాహిద్ కపూర్), తన తాతయ్య (అమోల్ పారేకర్) తో కలిసి ఉంటాడు. సన్నీ ఒక ఆర్టిస్ట్. ఏదైనా ఒక పెయింటింగ్ చూపిస్తే అది ఎలా ఉందో అలానే గీయడం చేస్తూ ఉంటాడు. కానీ ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటాడు. అప్పుడు సన్నీకి ఒక ఆలోచన వస్తుంది. సన్నీ మిత్రుడు ఫిరోజ్ తో కలిసి దొంగ నోట్లు తయారు చేయాలి అని అనుకుంటాడు. సన్నీ ఈ పని చేస్తున్న విషయం ఒక అండర్ వరల్డ్ కింగ్ అయిన మన్సూర్ దలాల్ (కే కే మీనన్) కి తెలియడంతో సన్నీని తన దగ్గర పని చేయమని అడుగుతాడు.
ఇక్కడ జరుగుతున్న ఈ ఫేక్ కరెన్సీ వ్యాపారాన్ని అడ్డుకోవాలి అని పోలీస్ అధికారి మైఖేల్ (విజయ్ సేతుపతి) వస్తాడు. సన్నీ చేస్తున్న పనిని మైఖేల్ అడ్డుకోగలిగాడా? మైకేల్ కి ఫేక్ కరెన్సీ ఎక్స్పర్ట్ మేఘ ఎలా సహాయపడింది? సన్నీ ఏం చేశాడు? తన కల నెరవేర్చుకున్నాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే.
రివ్యూ :
ఒక సమయం వరకు ప్రేక్షకులకు కాలక్షేపం అంటే కేవలం సినిమా మాత్రమే. కానీ ఆ తర్వాత వెబ్ సిరీస్ రావడం మొదలయ్యాయి. మల్టీప్లెక్స్ జనాలు కూడా ఇలాంటి వెబ్ సిరీస్ వైపు ఆసక్తి చూపించడం ఎక్కువయ్యింది. దాంతో పెద్ద పెద్ద స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా ఈ సిరీస్ లో నటిస్తున్నారు. గత సంవత్సరం సమంత ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో నటించారు. ఆ సిరీస్ రూపొందించిన రాజ్,డికె ఇప్పుడు మళ్ళీ ఫర్జీ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
ఈ దర్శకులు ఇద్దరు కథ రాసుకున్న తీరు చాలా బాగుంది. సిరీస్ మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. సిరీస్ ని తెలుగులో కూడా డబ్ చేశారు. సిరీస్ మొత్తం కూడా బ్రెయిన్ గేమ్ మీద నడుస్తుంది. ఒక ఆర్టిస్ట్ తన కళని ఉపయోగించి తనకి డబ్బు రావడానికి ఏం చేశాడు? ఆ నేపథ్యంలో ఆ ఆర్టిస్ట్ కి ఎదురైన సంఘటనలు ఏంటి? అనే అంశం చుట్టూ సిరీస్ నడుస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కి ఇది మొదటి వెబ్ సిరీస్. అలాగే విజయ్ సేతుపతి కూడా ఈ సిరీస్ తో హిందీలో అడుగు పెట్టారు. విజయ్ సేతుపతి పాత్ర సీరియస్ గా ఉంటూనే ఒక పక్క కామెడీ చేస్తూ ఉంటుంది. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడంతో ఇంకా హైలైట్ అయ్యింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
- నటీనటులు
- కాన్సెప్ట్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- అక్కడక్కడ కొంచెం సాగదీసినట్టుగా ఉన్న కొన్ని సీన్స్
- కొన్ని చోట్ల స్లో అయిన కథనం
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఈ మధ్య వెబ్ సిరీస్ కూడా సినిమాలకి తక్కువగా ఉండట్లేదు. అందుకే ప్రేక్షకులకి సినిమాలతో సమానంగా వెబ్ సిరీస్ అంటే కూడా ఆసక్తి ఏర్పడింది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్ లో ఒకటిగా ఇది నిలుస్తుంది. డార్క్ కామెడీ ఇష్టపడే వాళ్ళకి, ఒక మంచి బ్రెయిన్ గేమ్ తో నడిచే ఒక సిరీస్ చూద్దాం అనుకునే వారికి ఫర్జీ ఒక మంచి సిరీస్ గా నిలుస్తుంది.
watch trailer :
End of Article