చీటింగ్ ఆరోపణలపై స్పందించిన “సింగర్ యశస్వి”..!!

చీటింగ్ ఆరోపణలపై స్పందించిన “సింగర్ యశస్వి”..!!

by Anudeep

Ads

‘సరిగమప’ టైటిల్‌ విన్నర్‌ యశస్వి కొండెపూడి ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సింగింగ్‌ కాంపిటీషన్‌కు హాజరైన యశస్వి.. తాను పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. కాకినాడకు చెందిన నవసేన ఫౌండేషన్‌ పిల్లలతో ఫొటోలు దిగి.. అది తానే నడుపుతున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా తప్పుడు ప్రచారమంటూ ఆ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు ఫరా కౌసర్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యం లో మీడియా ముందుకి వచ్చి ఆమె సింగర్ యశస్వి పై పలు ఆరోపణలు చేసారు. యశస్విపై చర్యలు తీసుకోవాలని ఫరా డిమాండ్ చేశారు.

Video Advertisement

 

 

దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా యశస్విపై ట్రోలింగ్ మొదలైంది. చాలామంది అతనిని తిట్టిపోస్తున్నారు. దీంతో ఈ ఆరోపణలపై సింగర్ యశస్వి తాజాగా స్పందించాడు. “నవసేన ఫౌండేషన్‌కు, అందులోని పిల్లలకు సాయం చేస్తున్నట్లు, వారిని దత్తత తీసుకున్నట్లు నేనెక్కడా అనలేదు. నేను వాళ్ల దగ్గరకు కూడా వెళ్లలేదు. నాకు, ఈ ఫౌండేషన్‌కు అసలు సంబంధమే లేదు. సాధ్య అనే ఒక ఫౌండేషన్‌కు మేమంతా సాయం చేస్తుంటాం. ఈ ఫౌండేషన్ మరికొన్ని సంస్థలకు చేయూత అందిస్తుంది. మా బ్రదర్స్‌ కూడా సాధ్య ఫౌండేషన్‌కు చేతనైన సాయం చేశారు. దీనిద్వారా వారు నవసేన ట్రస్టుకి మూడు, నాలుగుసార్లు హెల్ప్‌ చేశారు. అందులో భాగంగానే నవసేన ఫౌండేషన్‌ నిర్వాహకులు ఫరా ఎదురుగానే పిల్లలతో ఆల్‌ద బెస్ట్‌ చెప్పిస్తూ వీడియోలు చేశారు.

singer yasahwi responce on fake social service alligations..

అలాగే నా అభిమానులు కూడా పుట్టినరోజు నాడు అదే ట్రస్టులో పిల్లలతో కేక్‌ కట్‌ చేసి విషెస్‌ చెప్పారు. ఆ వీడియోలన్నింటినీ చిన్నగా ఎడిట్‌ చేసి ప్రోమోలో యాడ్‌ చేశారు.అయితే ఇందులో నవసేన పేరు కనిపించింది. మా పేరు వాడుకున్నారు, కానీ పిల్లలను చూపించలేదు అని ఫరా అడిగారు. దీనికి జస్ట్‌ ప్రోమోనే, ఎపిసోడ్‌లో అంతా వస్తుందని క్లారిటీ ఇచ్చాను. కానీ ఈ లోపే ఆమె ఇదంతా చేస్తున్నారు. దీంతో ప్రోమో డిలీట్‌ చేయించా. ఎపిసోడ్‌లో కూడా అవేవీ ఉండకుండా ఎడిట్‌ చేసేయమన్నాను. ” అని యశస్వి చెప్పుకొచ్చారు.

singer yasahwi responce on fake social service alligations..

ఇంతవరకు నా లైఫ్‌లో ఎక్కడా నాకు నెగెటివ్‌ మార్క్‌ లేదు. అలాంటిది ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే చాలా బాధగా ఉంది అని యశస్వి ఆవేదన వ్యక్తం చేసారు. మా సంస్థ బోర్డు వాడారు కాబట్టి 9 నెలల పాటు అనాధాశ్రమాన్ని దత్తత తీసుకోవాలని ఫరా డిమాండ్‌ చేస్తున్నారు. నాకు ఉన్నంతలో సాయం చేస్తాను, కానీ దత్తత ఎలా తీసుకుంటాను అంటూ ఆయన అన్నారు. ఆమె లీగల్ గా వెళ్తా అంటున్నారు.. ఆమె ఇష్టం అని చెప్పాను.. అని యశస్వి తెలిపారు.


End of Article

You may also like