Ads
ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులందరూ తెగ సంబరపడిపోతుంటారు. అయితే వాలెంటైన్స్ డే దగ్గరికి వచ్చే సమయంలో మాత్రం కొందరు అబ్బాయిలు తెగ ఆందోళన చెందుతారు. తమకిష్టమైన అమ్మాయిని ఎలా ఇంప్రెస్ చేయాలా అని తెగ హైరానా పడుతుంటారు. ఒక వేళ ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి సమాధానం ఏముంటుందా అని తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకవేళ ఎస్ అంటే మాత్రం అప్పటిదాకా వన్ సైడ్ ట్రాక్ లో ఉన్న మీ లవ్.. రెండు ట్రాక్ లపై సాఫీగా సాగిపోతుంది.
Video Advertisement
అయితే ఆ సమాధానం ఎన్నిసార్లు ఎస్ అయి ఉండదు. తమకి ఇష్టం లేని ప్రపోసల్ ని అమ్మాయిలు రిజెక్ట్ చేసే హక్కు కూడా ఉంటుంది. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి జరగ్గా.. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కి ప్రపోజ్ చేయగా.. ఆమె దాన్ని రిజెక్ట్ చేసినట్టు కనిపిస్తోంది.
వైరల్ అయిన ఆ వీడియో ఒక క్లాస్ రూమ్ లో తీసినట్టు గా కనిపిస్తోంది. అందులో ఒక రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్న ఒక అబ్బాయి.. తన క్లాసుమేట్ కి గులాబీ పువ్వుతో ప్రపోజ్ చేయగా.. ఆమె ఆ పువ్వుని విసిరేసి రిజెక్ట్ చేస్తుంది. దీంతో ఆ అబ్బాయి కూడా అలాగే విసురుగా ఆమె చేతిని తోసేసాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్న తోపులాట జరుగుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి కోపంగా తన బాగ్ ని విసిరెయ్యగా.. ఆ అబ్బాయి తప్పించుకుంటాడు.
ఆ వీడియో ని చూస్తుంటే ముందుగా ఆ అమ్మాయి కి ఆ ప్రపోసల్ ఇష్టం లేనట్టుగా తెలుస్తోంది. ఆ ప్రపోసల్ వినడానికే ఆ అమ్మాయి సిద్ధంగా లేకపోవడం తో ఆ యువకుడు బ్రతిమిలాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రపోజ్ చెయ్యగా చిన్న గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన సమయం లో వారి తోటి విద్యార్థులు ఈ సన్నివేశాన్ని మొబైల్స్ లో షూట్ చేసారు. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ గా మారి.. నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఘర్ కే కాలేష్ అనే ట్విట్టర్ ఖాతా లో షేర్ చేసిన ఈ వీడియోను 103 వేల సార్లు వీక్షించారు మరియు వేలాది మంది నెటిజన్లు లైక్ చేసారు.
watch video:
Proposal Reject kalesh 😓 pic.twitter.com/oPNTLb48DZ
— Ghar Ke Kalesh (@gharkekalesh) February 5, 2023
End of Article