Home Filmy Adda ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో యాక్షన్ సీన్స్ లో దుమ్ము లేపనున్న “సమంత”..!!

‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో యాక్షన్ సీన్స్ లో దుమ్ము లేపనున్న “సమంత”..!!

by Anudeep

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ‘యశోద’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈమె నటించిన శాకుంతలం చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. అయితే సామ్ గత కొన్నినెలలుగా మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే అంతకుముందు నుంచే సమంత ఆరోగ్య పరిస్థితిపై పలు రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత హెల్త్ బాలేకపోవడంతో గత కొన్ని నెలలుగా ఆమె సినిమాలకు షూటింగులకు దూరంగా ఉంది. దీంతో సమంత చేయాల్సిన సినిమాలకు బ్రేకులు పడ్డాయి.

 

 

అయితే ఫ్యామిలీ మ్యాన్‌-2 త‌ర్వాత బాలీవుడ్‌లో మ‌రో యాక్ష‌న్ వెబ్‌సిరీస్‌కు స‌మంత గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ ద‌ర్శ‌క‌ద్వ‌యం రాజ్ డీకే ద‌ర్శ‌క‌త్వంలో స్ఫై యాక్ష‌న్‌ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఈ సిటాడెల్ సిరీస్ రూపొందుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ , సమంత కలిసి నటించనున్నారు.

samantha doing more action scenes in citadel web series..!!

యాక్షన్ సినిమాలను రూపొందించే ‘రూసో బ్రదర్స్’ తమ ‘ABGO ఫిలిమ్స్’ బ్యానేర్ పై ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు. ‘సిటాడెల్ ఇంటలిజెన్స్ రైవల్ ఏజెన్సీ’ పేరుతో యూనివర్స్ ని క్రియేట్ చేసి సిటాడెల్ ఫ్రాంచైజీని రూపొందిస్తున్నారు. ఇందులో మెయిన్ సిరీస్ లో అమెరికన్ నటుడు రిచర్డ్ మేడిన్, ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. ఇండియన్ స్పై థ్రిల్లర్ షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది.

 

samantha doing more action scenes in citadel web series..!!

సమంత ఫామిలీ మాన్ సిరీస్ 2 , తాజాగా వచ్చిన యశోద చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్ లతో అలరించింది. ఇక రానున్న సిటాడెల్ వెబ్ సిరీస్ లో కూడా సమంత మరోసారి యాక్షన్ స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. అందులో భాగంగా రిహార్సల్స్ చేస్తోన్న ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పంచుకుంది సామ్. ఈ సిరీస్‌తో పాటు సమంత, విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమాలోనూ నటిస్తోంది.

 

You may also like