Ads
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అమిగోస్.. డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమాలో డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్. కాగా ఇప్పుడు అమిగోస్ సినిమాలో త్రిపాత్రాభినంలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న గ్రాండ్ లెవల్లో సినిమా రిలీజ్ అయ్యింది.
Video Advertisement
అయితే ఈ చిత్రానికి అంచనాలకు తగ్గట్టే ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.30 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.00 కోట్లుగా నమోదైంది. తాజాగా ఈ చిత్రం ఆరు రోజులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం తో కలెక్షన్స్ లో గ్రోత్ ఏ మాత్రం లేదు. 6వ రోజుకి వచ్చే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర 16 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 19 లక్షల షేర్ ని అందుకుంది అమిగోస్.
అలాగే ఆరు రోజులకు గాను అమిగోస్ చిత్రానికి రూ. 6.11 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.70 కోట్లు గ్రాస్ వసూలైంది. అంటే మరో రూ. 5.89 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది. కానీ పరిస్థితిని చూస్తుంటే సినిమా టార్గెట్ ని రీచ్ అయ్యేలా కనిపించడం లేదు. అలాగే కొత్త సినిమాలు కూడా విడుదల అవుతుండటం తో అమిగోస్ ని నిరాశ తప్పేలా లేదు.
కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డి రూపొందించిన చిత్రం ‘అమిగోస్’. డాపుల్ గ్యాంగర్ అనే కాన్సెప్టుతో వచ్చిన ఈ చిత్రంలో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మించారు. దీనికి గిబ్రాన్ సంగీతాన్ని అందించారు. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే మరో వైపు అమిగోస్ మూవీ ఓటీటీ కూడా ఫిక్స్ అయ్యింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
End of Article