వినరో భాగ్యము విష్ణు కథ Vs సార్..! ఈ 2 సినిమాల టాక్ ఒకటే..! కానీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే..?

వినరో భాగ్యము విష్ణు కథ Vs సార్..! ఈ 2 సినిమాల టాక్ ఒకటే..! కానీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే..?

by Anudeep

Ads

తొలిప్రేమ, రంగ్‌దే వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో హిట్స్ అందుకున్న వెంకీ అట్లూరి ఇటీవల తెరకెక్కించిన చిత్రం ‘సార్’. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ నటించిన ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్ ఇదే కాగా.. ఇందులో ఆయన కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించారు. చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ కార్పొరేట్ కాలేజీల దోపిడీని ఎండగట్టే కథతో తెరకెక్కిన ‘సార్’.. ఫిబ్రవరి 17న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్‌లో రూ. 16.54 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు తెలుగులో విడుదలైన ధనుష్ చిత్రాల్లో ఇవే మెజారిటీ కలెక్షన్స్ కావడం విశేషం.

Video Advertisement

అలాగే తమిళం లో ఈ చిత్రం గత మూడో రోజుల్లో 18.5 కోట్లకుపైగానే వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు నేరుగా తెలుగులో మూవీ చేయడంతో అభిమానులు అదిరిపోయే వెల్కమ్ అందించారు ‘సార్’ మూవీ వీకెండ్‌లో భారీగానే కలెక్ట్ చేసినప్పటికీ.. నాన్ వీక్ డేస్‌లో బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించిన ‘సార్’ చిత్రంలో సముద్రఖని, తనికెళ్ల భరణి, సాయి కుమార్, నర్రా శ్రీనివాస్, హైపర్ ఆది తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

sir, vinaro bhagyamu vishnu katha movies collections

యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో పెద్దగా సక్సెస్ లు లేవు. ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమాతో అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేకపోయాయి. దీంతో తాజాగా వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం పైనే అతడు ఆశలు పెట్టుకున్నాడు. ధనుష్ చిత్రం తో పోటీ పడుతూ ఉన్నంత లో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ నే సాధిస్తోంది. కిరణ్ అబ్బవరం ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తర్వాత ఈ మూవీ కే సెకెండ్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయమని చెప్పాలి.

sir, vinaro bhagyamu vishnu katha movies collections

ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అలాగే 2 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 2.81 కోట్లు షేర్‌తో పాటు రూ. 5.15 కోట్లు గ్రాస్ వసూలైంది. మరో రూ. 1.69 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌ స్టేటస్‌ను చేరుతుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. దీనికి చైతన్ భరద్వాజ్ సంగీతం ఇచ్చారు. ఇందులో మురళీ శర్మ, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు.


End of Article

You may also like