Ads
అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో విడుదల అయినా కూడా లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఈ సినిమాని చూశారు. ఒకరకంగా పుష్ప కంటే ముందే ఈ సినిమా అల్లు అర్జున్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించి పెట్టింది.
Video Advertisement
ఇందులో పాటలు అయితే చాలా పెద్ద హిట్ అయ్యాయి. అందులో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్ ఇంకా హైలైట్ అయ్యాయి. అసలు హీరో పాత్రలో అల్లు అర్జున్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోవడం కష్టం ఏమో అనిపించే అంతగా అల్లు అర్జున్ పాత్ర ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. ఆ సినిమాని కూడా అల్లు అరవింద్ నిర్మించారు.

ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత అల్లు అర్జున్ చేసిన అంత బాగా కార్తీక్ ఆర్యన్ చేయలేరు అని అన్నారు. సినిమా చూశాక తెలుగు సినిమాలో ఉన్న ఫీల్ అసలు హిందీ సినిమాలో లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. అందుకు కారణం ఆ సినిమాలో చేసిన మార్పులు. హిందీ రీమేక్ లో చేసిన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

#1 ఇందులో హీరో పాత్ర అయిన బంటు, వాల్మీకి అనే వ్యక్తి ఇంట్లో పెరుగుతాడు. తెలుగులో వాల్మీకి కి భార్య ఉన్నట్టు చూపిస్తారు. అసలు ఒక రకంగా తనని పెంచిన తల్లి కారణంగానే, తాను తన సొంత తల్లిని తల్లి అని అంగీకరించలేను అని తెలుగులో బంటు అనుకుంటాడు. కానీ హిందీలో తల్లి పాత్ర చనిపోయినట్టు, తండ్రి బంటుని పెంచినట్టు చూపిస్తారు. దాంతో అసలు ఈ సినిమాకి మెయిన్ హైలైట్ అయిన మదర్ సెంటిమెంట్ హిందీ రీమేక్ లో లేదు.

#2 అంతే కాకుండా హీరో, హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా, తెలుగులో ముందు హీరోయిన్ ని చూసి ఇష్టపడిన హీరో, ఆ తర్వాత హీరోయిన్ వ్యక్తిత్వాన్ని ఇష్టపడతాడు అన్నట్టు చూపించారు. కానీ హిందీలో మాత్రం వారి ఇద్దరి మధ్య వచ్చే స్టోరీ చాలా కమర్షియల్ సినిమాల్లో చూసినట్టు ఉంటుంది. హీరోయిన్ వెనకాల హీరో పడటం అనే కాన్సెప్ట్ తోనే వారి స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ కూడా ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే బాగుండేది ఏమో అని అనిపిస్తుంది.

#3 తెలుగులో అసలు సినిమాకి మొత్తానికి హైలైట్ అయిన సీన్ సెకండ్ హాఫ్ లో వచ్చే బోర్డ్ రూమ్ సీన్. అందులో అల్లు అర్జున్ అందరు స్టార్ హీరోల పాటకి డాన్స్ వేస్తారు. ఈ సీన్ చూసినప్పుడు థియేటర్లలో విజిల్స్ వేశారు. అంత మంచి సీన్ ని హిందీలో తీసేసారు. హీరో ఏదో ఒక స్పీచ్ చెప్పినట్టు చూపిస్తారు. అసలు సెకండ్ హాఫ్ చూసేదే ఈ సీన్ కోసం. అలాంటిది ఈ సీన్ లేకపోతే ఇంక సినిమా ఏం చూడాలి అనిపిస్తుంది అని కామెంట్స్ వచ్చాయి.

#4 తెలుగులో సుశాంత్ పోషించిన పాత్రకి పూర్తి భిన్నంగా హిందీలో ఆ పాత్ర పోషించిన వ్యక్తి పాత్ర ఉంటుంది. తెలుగులో సుశాంత్ కి చెడు అలవాట్లు ఉన్నా కూడా అవన్నీ బయటికి కనిపించకుండా కవర్ చేసే వ్యక్తి అని చూపించారు. హిందీలో మాత్రం అదేదో జోకర్ లాగా చూపించారు. దాంతో అది కూడా ఆల్రెడీ తెలుగు సినిమా చూసిన ప్రేక్షకులకి అంత గొప్పగా ఏమీ అనిపించలేదు.

#5 అసలు తెలుగు సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం పాటలు, డాన్స్. ఇవి మాత్రమే కాకుండా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే మామూలుగా తన డైలాగ్స్ కి చాలా క్రేజ్ ఉన్న వ్యక్తి. ఆయన సినిమాల్లో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయేవి ఆయన రాసిన డైలాగ్స్. అలాంటిది హిందీ సినిమాలో అలాంటి డైలాగ్స్ లేకపోవడం వల్ల ఎమోషన్స్ తెరపై బాగా అనిపించవు.

ఈ కారణాల వల్ల తెలుగు సినిమా హిట్ అయినంత మంచి టాక్ హిందీ సినిమాకి రావట్లేదు. ప్రేక్షకులకి కూడా తెలుగు సినిమా నచ్చిన అంత బాగా హిందీ సినిమా నచ్చట్లేదు.
End of Article
