“హీరో సుధీర్ బాబు” కి ఏమైంది..ఇలా అయిపోయారేంటి..??

“హీరో సుధీర్ బాబు” కి ఏమైంది..ఇలా అయిపోయారేంటి..??

by Anudeep

Ads

తెలుగు తెరకు “SMS” చిత్రంతో పరిచయమైన హీరో సుధీర్ బాబు. తన వైవిధ్యమైన కథల ఎంపికతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇటీవల సుధీర్ బాబు ‘హంట్’ అనే యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. 2018 లో వచ్చిన సమ్మోహనం సినిమా తరువాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ ని సుధీర్ బాబు అందుకోలేక పోయాడు. మధ్యలో ‘శ్రీదేవి సోడా సెంటర్’తో కొంత వరకు ఆకట్టుకున్నాడు. దీంతో తదుపరి చిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు సుధీర్ బాబు.

Video Advertisement

అయితే తాజాగా సుధీర్ బాబు నటిస్తున్న ‘మామా మశ్చీంద్ర’ కొత్త మూవీ నుంచి ఒక వీడియో లీక్ అయ్యి నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో సుధీర్ బాబు లావుగా కనిపిస్తున్నాడు. బరువు పెరిగి సరికొత్త లుక్ లో కనిపించడమే కాదు, డిఫరెంట్ గెటప్ అండ్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ చిన్న వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ లో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ బాడీతో కనబడ్డాడు. ఇప్పుడు ఈ వీడియోలో దానికి పూర్తి బిన్నంగా కనిపించాడు.

sudheer babu latest look..

దీంతో ఈ సినిమాలో సుధీర్ బాబు డ్యూయల్ రోల్ చేయబోతున్నాడా అని సందేహం పడుతున్నారు నెటిజెన్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ చిత్రానికి తెలుగు నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుంది. ఇందులో హీరోయిన్ గా తమిళ నటి మృణాళిని రవి నటిస్తోంది. ఇంతకు ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో సుధీర్ బాబు రాక్ స్టార్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

sudheer babu latest look..

సుధీర్ బాబు కెరీర్ లో 15 వ చిత్రం గా రానున్న ఈ సినిమాలో అతడు ఛాలెంజింగ్ పాత్రని పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సుధీర్ బాబు ఇప్పటికే టైగెర్ ష్రాఫ్ నటించిన భాగీ చిత్రం లో ప్రతి నాయకుడిగా నటించి అక్కడి వారికి చేరువ అయ్యాడు. దీంతో ఈ చిత్రాన్ని అక్కడ కూడా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

watch video :

https://twitter.com/sairaaj44/status/1630090432599425025


End of Article

You may also like