Ads
సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు మహేష్ బాబు. బాల నటుడిగా ఆయన 8 కి పైగా చిత్రాల్లో నటించాడు. కథానాయకుడిగా 25 కి పైగా చిత్రాల్లో నటించాడు. హీరోగా చేసిన మొదటి సినిమా ‘రాజ కుమారుడు’ చిత్రం తోనే ఉత్తమ నూతన నటుడిగా నంది అవార్డు గెలుచుకున్నాడు మహేష్. అయితే చాలా తక్కువ సమయం లోనే సూపర్ స్టార్ గా మారాడు మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో ఒక చిత్రం, రాజమౌళి తో మరో చిత్రం చేయనున్నారు.
Video Advertisement
తాజాగా మహేష్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న చిత్రాన్ని పోస్ట్ చేసారు. మహేష్ కొత్త లుక్ ని చూసిన ఫాన్స్ తెగ సంతోష పడిపోతున్నారు. నిజానికి మహేష్ స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు. చిన్నప్పుడు కాస్త బొద్దుగా ఉన్న మహేష్.. హీరో అయ్యాక పూర్తి ఫిట్ గా మారారు. అయితే ఇప్పటివరకు ఆయనను జిమ్ బాడీలో ఎవరూ ప్రజెంట్ చేయలేదు. చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపించింది లేదు. తాజాగా మహేష్ గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. నిపుణుల పర్యవేక్షణలో కండలు పెంచేందుకు శిక్షణ తీసుకుంటున్నాడు. తన వర్క్ అవుట్ సెషన్ ఫోటోలు ఆయన షేర్ చేశారు. ప్రత్యేకంగా చేతులు చూపిస్తూ ‘ఆర్మ్ డే’ అని కామెంట్ చేశారు.
ఈ ఫొటోలో జిమ్ చేయడంతో నరాలు కూడా ఉబ్బి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేష్ జిమ్ బాడీ లుక్ సరికొత్తగా ఉంది. అయితే ఆయన పూర్తి షేప్ సాధించేందుకు సమయం పడుతుంది. అయితే ఈ కొత్త లుక్ రాజమౌళి చిత్రం కోసమా.. లేక త్రివిక్రమ్ చిత్రం కోసమా అని తెలియాల్సి ఉంది. రాజమౌళి తన గత మూడు చిత్రాల్లో హీరోలను కండల వీరులుగానే చూపించారు. సో మహేష్ ని కూడా అలాగే చూపించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ చిత్ర షూట్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఒక భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం. తదుపరి షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసారు. ఇక తాజా ఫొటోస్ లో మహేష్ బాబు చూసిన అభిమాను పూనకాలతో ఊగిపోతున్నారు. బాబులకు బాబు మా మహేష్ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు బీస్ట్ లుక్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ లుక్ పై నెట్టింట పలు మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article