Ads
ఒక్కొక్కసారి సినిమా హిట్ అయిందని దాన్ని మరొక ఇండస్ట్రీ వాళ్ళు రీమేక్ చేస్తూ ఉంటారు ఇలా ఒక ఇండస్ట్రీ వాళ్ళ సినిమాలను చూసి మరొక ఇండస్ట్రీ వాళ్ళు చాలా సినిమాలని రీమేక్ చేసారు.
Video Advertisement
తెలుగులో హిట్ అయ్యి బాలీవుడ్లో డిజాస్టర్ గా మిగిలిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఇప్పుడే చూసేద్దాం.
#1. జెర్సీ:
నాని నటించిన జెర్సీ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశారు కానీ ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో జెర్సీ సినిమా కారణంగా నాని కి డైరెక్టర్ కి మంచి పేరు వచ్చింది కానీ హిందీ ఆడియన్స్ మాత్రం మనలాగ రెస్పాండ్ అవ్వలేదు.
#2. హిట్ ఫస్ట్ కేస్:
ఈ సినిమా కూడా బాలీవుడ్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది టాలీవుడ్ లో ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ హిందీలో మాత్రం రాలేదు.
#3. కాంచన:
కాంచన సినిమా టాలీవుడ్ లో ఎంతగా హిట్ అయిందో మనకి తెలిసిన విషయమే. కానీ హిందీలో వచ్చిన లక్ష్మి డిజాస్టర్ గానే మిగిలిపోయింది.
#4. MCA:
తెలుగులో నాని హీరోగా వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి MCA సినిమాని హిందీలో నీకమ్మ కింద మళ్లీ తీశారు. కానీ ఆ సినిమా కి నెగిటివ్ రివ్యూస్ తప్పులేదు.
#5. అల వైకుంఠపురంలో:
అల్లు అర్జున్ పూజ హెగ్డే కాంబినేషన్ లో అల వైకుంఠపురం సినిమా వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమాని హిందీలో షెహజాదా కింద తీశారు. కానీ ఫెయిల్యూర్ తప్పలేదు.
#6. నువ్వొస్తానంటే నేనొద్దంటానా:
నువ్వొస్తానంటే నేనొద్దంటానా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. రామయ్య వస్తావయ్యా టైటిల్ తో దీన్ని తీశారు హిందీలో. కానీ ఆడలేదు.
#7. ఒక్కడు:
తేవర్ టైటిల్ తో బాలీవుడ్ లో ఒక్కడు సినిమాను తీశారు కానీ ఈ సినిమా అక్కడ ప్రేక్షకులకు ఎక్కలేదు.
#8. వర్షం:
హిందీలో వర్షం ని బాగి పేరుతో తీశారు కానీ ఈ సినిమా కూడా హిట్ కాలేదు.
#9. కందిరీగ:
తెలుగులో రామ్ హీరోగా వచ్చిన కందిరీగ సినిమాని హిందీలో తీశారు కానీ అది ఫ్లాప్ అయింది.
End of Article