Ads
సినీ ఇండస్ట్రీ లో హిట్ లు ప్లాపులు సదరు హీరో, డైరెక్టర్ల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. కొందరు ఒకటి రెండు సినిమాలకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. కానీ మరికొందరు హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతారు. ఆ కోవలోకే చెందుతారు యంగ్ హీరో ఆది సాయి కుమార్.
Video Advertisement
డైలాగ్ కింగ్ సాయి కుమార్ నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆది సాయి కుమార్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటన తో, డైలాగ్ డెలివరీ తో ఎందరో అభిమానుల్ని గెలుచుకున్నారు. మొదట్లో మంచి కథల్నే ఎంచుకున్న ఆది తర్వాత కథల ఎంపికలో తడబడ్డాడు.
మొదటి సినిమా ప్రేమ కావాలి తో అందర్నీ తనవైపుకు తిప్పుకున్నారు ఆది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. మరో యంగ్ హ్యాండ్సమ్ హీరో ఇండస్ట్రీ కి దొరికాడు అనుకున్నారు. కానీ తర్వాత వచ్చిన లవ్లీ, సుకుమారుడు వంటి చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. కానీ ఆ తరువాత అన్ని ప్లాప్ లే వెక్కిరించాయి. వాటిలో ప్యార్ మే పడిపోయానే, గాలిపటం, రఫ్, చుట్టాలబ్బాయి, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ, జోడి, గోల్డ్ ఫిష్, శశి, తీస్మార్ ఖాన్ వంటి సినిమాలున్నాయి. మధ్యలో మల్టీస్టారర్ మూవీస్ కూడా చేసాడు ఆది . విభిన్న కథలను ఎంచుకున్నారు, నటనలో వైవిధ్యం చూపినా ఆదిని ప్లాప్ లు వదల్లేదు. అవన్నీ కాదని ఆదికి సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయ్. ఆదితో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
ఈ ఏడాది ఇప్పటికే బ్లాక్, తీస్ మార్ ఖాన్, అతిథి దేవోభవ, క్రేజీ ఫెలో లాంటి సినిమాలతో వచ్చాడు ఆది. ఈయనకు ఇన్ని అవకాశాలు ఎలా వస్తున్నాయి అని లెక్కలు వేసుకుంటే.. దాని వెనుక ఉన్న లాజిక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
ఆది సాయికుమార్ తో సినిమా చేయాలంటే కనీసం రూ. రెండు కోట్ల బడ్జెట్ ఉంటే సరిపోతుంది. అతడితో సినిమా చేసే ఏ దర్శకుడైన కూడా పక్కా కమర్షియల్ ఫార్మేట్ లో చేస్తూ వస్తున్నాడు. ఇదే ఆది సినిమాలకు వర్కౌట్ అవుతోంది.
ఆది ప్రతి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో మంచి రేటు ఇచ్చి కొనుక్కుంటుంది. అతడి చాలా సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో కనీసం కోటి రూపాయల కంటే ఎక్కువ బిజినెస్ చేశాయి. ఇదిలా ఉంటే హిందీ మార్కెట్ ఆదికి చాలా ప్లస్ అవుతుంది. మన దగ్గర ఇమేజ్ ఎలా ఉన్నా కూడా హిందీలో మాత్రం ఆది సినిమాలకు డిమాండ్ చాలా ఉంది.యూ ట్యూబ్ లో ఆది సాయికుమార్ హిందీ డబ్బింగ్ సినిమాలకు అదిరిపోయే డిమాండ్ ఉంది. ఆదిహిందీ డబ్బింగ్ చిత్రాలకు యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.
ఇలా ఎలా చూసుకున్నా కూడా.. సినిమా మీద నిర్మాతలు పెట్టిన బడ్జెట్ విడుదలకు ముందే వర్కౌట్ అవుతుంది. ముఖ్యంగా డాన్సుల్లో ఈజ్, డైలాగ్ డెలివరీ వంటివి ఆది సాయికుమార్‌కు కలిసొచ్చే అంశాలు. అందుకే నిర్మాతలు ఆది తో సినిమాలు చేయడానికీ క్యూ కడుతున్నారు.
అందుకే ఆయన సినిమాలు థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా.. శాటిలైట్, ఓటిటి, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో నిర్మాతలు బయటపడిపోతున్నారు. మిగిలిన ఏ హీరోలకు లేని అడ్వాంటేజ్ ఆదికి ఉంది కాబట్టే వీలైనంత తక్కువ బడ్జెట్ లో ఇతడితో సినిమాలు చేసి లాభాలు తెచ్చుకుంటున్నారు నిర్మాతలు.
End of Article