Ads
దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ని ఎంతో అందంగా తెర మీద కి తీసుకు వచ్చారు. అంతర్జాతీయ పురస్కారమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఈ సినిమా కి వచ్చింది. బెస్ట్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ రెండు క్యాటగిరీల్లో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
Video Advertisement
అలానే ఈ సినిమా లోని ‘నాటు నాటు’ సాంగ్ కి అవార్డు వచ్చింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ కి కూడా నామినేట్ అవ్వడం తో ఇండియా అంతా కూడా అవార్డు రావాలని కోరుకుంది. ఈ పాట కి చంద్రబోస్ లిరిక్స్ ని ఇచ్చారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకుడు. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఇద్దరు ఈ పాటని పాడారు.
అయితే నిన్నటి వరకు ఆస్కార్ అవార్డు మన భారత దేశానికి రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. ఇప్పుడు ఈ అవార్డు మనకి రావడం తో అందరు కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా లో కూడా అవార్డు వచ్చిందని అంతా పోస్ట్ చేస్తున్నారు కూడా. ‘నాటు నాటు’ సాంగ్ కి అవార్డు రావడం తో విదేశీ గడ్డపై తెలుగోడి ఖ్యాతి రెపరెపలాడుతోంది. ఇదిలా ఉంటే ఈ పాట కి ఆస్కార్ వస్తుందా రాదా అనే విషయం పై జోరుగా బెట్టింగ్స్ కూడా జరిగాయి.
ఆన్లైన్ వేదికగా కోట్ల లో నగదు చేతులు మారింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో ఆన్లైన్ లో బుకీలు 1:4 రేంజ్‌తో కోట్లలో బెట్టింగ్స్ పెట్టారని తెలుస్తోంది సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌లు వంటి వాటి మీద బెట్టింగ్‌లు వేస్తూ ఉంటారు కానీ ఆస్కార్ మీద బెట్టింగ్ వేయడం గమనార్హం. ఏది ఏమైనా మన పాట కి అవార్డు రావడం ఎంతో గొప్ప విషయం. ఈ పాట ఒరిజినల్ సాంగ్ విభాగం లో ఆస్కార్ ని దక్కించుకుంది.
End of Article