Ads
రామ్ చరణ్ ఎన్టీఆర్ నాటు నాటు పాట కి అద్భుతంగా డాన్స్ చేశారు. నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు కి 95వ ది అకాడమీ అవార్డ్ వచ్చింది. తొలి భారతీయ సినిమా పాటగా నాటు నాటు చరిత్రను సృష్టించేసింది.
Video Advertisement
నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో సెలబ్రిటీలంతా కూడా RRR సినిమా టీం ని మెచ్చుకుంటున్నారు. కీరవాణి, రాజమౌళి, ఎన్టీఆర్ చరణ్, చంద్ర బోస్ వీళ్లందరినీ ప్రశంసిస్తున్నారు.
లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక అసోసియేషన్ నుంచి ఉత్తమ సంగీతానికి ఎంఎం కీరవాణి అవార్డుని అందుకున్నారు. ప్రేమ్ రక్షిత కొరియోగ్రఫీ ని ఇచ్చారు. చంద్రబోస్ ఈ పాటకి లిరిక్స్ ని సమకూర్చారు. ఎం ఎం కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కలిసి పాడారు. నాటు నాటు పాటకి అవార్డు రావడంతో విమర్శకులు కూడా ఇప్పుడు ప్రశంసిస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వం గురించి చాలామంది ఎన్నో మాటలు అన్నారు. కానీ ఇప్పుడు అవన్నీ వెనక్కి తీసుకునే రోజు వచ్చేసింది. దర్శకుడు రాజమౌళి RRR అనే ఒక అద్భుతాన్ని సృష్టించాడు. రత్న పథక్ షా గతంలో రాజమౌళి ని విమర్శించారు. ‘రెగ్రెసివ్’ అని అన్నారు. దీనికి అర్థం తక్కువ అడ్వాన్స్డ్ లో ఉండడం. ముందుకెళ్ళకుండా వెనక్కి వెళదామని. ”ఈరోజుల్లో ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు చాలా పాపులర్ అయిపోయాయి కానీ ఇలాంటి సినిమాలు చాలా వెనక్కి వెళ్తున్నాయని…. మనం ముందుకు చూడాలి కానీ తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదని…
మనం మదర్ ఆఫ్ డెమోక్రసీ ఇండియా కాబట్టి మనం చేసేది మనం ఇష్టపడతాం సినిమాలు తీసే వాళ్ళు విమర్శ దృష్టిలో చూడకుండా ఉండేంతవరకు మనం ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు మాత్రమే చూడాలి” అని ఆమె చెప్పారు. పైగా విమర్శలు ఎవరికీ నచ్చవని అహం దెబ్బతింటుందని పెద్దవాళ్లు దీన్ని సృష్టించారు దురదృష్టవశాత్తు మనం వాటిని అంగీకరించాలని ఆమె చెప్పారు.
End of Article