2014 లో ”కీరవాణి” ఆ తప్పు చేసి ఉంటే… ఈరోజు ఆస్కార్ వచ్చేదే కాదు…!

2014 లో ”కీరవాణి” ఆ తప్పు చేసి ఉంటే… ఈరోజు ఆస్కార్ వచ్చేదే కాదు…!

by Megha Varna

Ads

95 వ ఆస్కార్ అవార్డ్ కార్యక్రమంలో తెలుగు సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగం లో నామినేట్ అయ్యి సరికొత్త చరిత్రను సృష్టించింది. నాటు నాటు సాంగ్ కి గాను ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో కీరవాణి, చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది. మొదట ఆస్కార్ కి RRR నామినేట్ అవుతుందని తెలియగానే వివిధ రకాలుగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి.

Video Advertisement

కానీ ఈ సినిమా మాత్రం వాటిని అన్నింటినీ కొట్టి పారేసింది. ఫైనల్ గా నాటు నాటు సాంగ్ కి గాను ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో కీరవాణి, చంద్రబోస్ కి ఆస్కార్ అవార్డు లాభించింది.

ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. మన తెలుగు పాట ఆస్కార్ దాకా వెళ్లిందంటే గొప్ప విషయమే కదా..? ఆస్కార్ అవార్డు వచ్చాక ఈ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్ర బోస్ ని ఎంతగానో పొగుడుతున్నారు. అంతే కాక అభినందనలు చెబుతున్నారు. 1929లో ఆస్కార్ అవార్డులు ప్రారంభమైనప్పటి నుంచి కూడా భారతీయ చిత్రాలు అత్యధికంగా నామినేట్ అవ్వడం ఇదే తొలి సారి. ఇవన్నీ పక్కన పెడితే కీరవాణి కొన్నేళ్ళ ముందే తన కెరియర్ ని ఆపేయాలని అనుకున్నారట. ఒక మాట అనేసి ఆయన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు.

Indians who won the Oscars..!!

2014లో కీరవాణి తన కెరీర్ గురించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ”ఇక సినిమాలు చాలాని నేను అనుకుంటున్నాను. త్వరలో సినిమాలనే వదిలేస్తారని ఆయన చెప్పారు”. అప్పటినుండి కూడా కీరవాణి సినిమాలు చేయరని అంతా అనుకున్నారు. తర్వాత ఆ ట్వీట్ గురించి క్లారిటీ ఇచ్చారు. తర్వాత కీరవాణి రిటైర్ అవుతున్నారని ఎన్నో రూమర్స్ కూడా వచ్చాయి వాటి మీద కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే అసలు విషయం ఏమిటంటే ఒకవేళ కనుక కీరవాణి కనుక సినిమాలని ఆపేసి ఉంటే.. ఆస్కార్ అవార్డు వచ్చేది కాదు. ఎప్పటినుండో మన దేశానికి ఆస్కార్ అనేది ఒక కల. ఒకవేళ కనుక కీరవాణి ఆరోజు నిజంగా సినిమాలని మానేసి ఉంటే ఈరోజు ఆస్కార్ వచ్చేది కాదు.


End of Article

You may also like