Ads
ఇప్పుడు ఎక్కడ విన్నా నాటు నాటు గురించే మాట్లాడుకుంటున్నారు. భారతీయ సినీ చరిత్రలో ‘నాటు నాటు’ది ప్రత్యేక స్థానం. మొదట నుండి కూడా నాటు నాటు పాట కి ఆస్కార్ వస్తుందా..? అసలు నామినేషన్స్ లో ఉంటుందా ఇలా ఎన్నో వినపడ్డాయి. కానీ నాటు నాటు పాట ఇప్పుడు ఆస్కార్ ని కైవసం చేసుకుంది.
Video Advertisement
బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ (ఉత్తమ పాట) విభాగంలో ‘నాటు నాటు’కు 95వ ది అకాడమీ అవార్డ్ వచ్చింది. ఈ సినిమా కి కీరవాణి మ్యూజిక్ ని ఇచ్చారు. ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ అందించారు.
చంద్ర బోస్ లిరిక్స్ ని ఇచ్చారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఈ పాటని ఎంతో అద్భుతంగా పాడారు. ఈ పాట కి రామ్ చరణ్ ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు అయితే వేరే లెవెల్ లో వున్నాయి. ఈ పాట కోసం నిజంగా ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆస్కార్ వచ్చింది అంతే ఈ పాట గొప్పతనం ఇంతా అంతా కాదు ఎంతో.. ఈ సినిమా కి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు ప్రొడ్యూసర్ గా దానయ్య అన్నిట్లోనూ పర్ఫెక్ట్ గా ఉన్నారు.
ఆస్కార్ ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ అంతా కూడా అమెరికా వెళ్లారు కానీ దానయ్య మాత్రం ఇక్కడే ఉన్నారు పైగా ఏ అవార్డు ఫంక్షన్ లో కూడా కనపడలేదు. ఆస్కార్ గురించి ఈయన తొలిసారి స్పందించారు. ఆస్కార్ రావడం గర్వించదగ్గ విషయమని దానయ్య చెప్పారు. 2006లో రాజమౌళికి అడ్వాన్స్ ఇచ్చి మూవీ చేద్దామని చెప్పారట. అప్పటినుండి కూడా రాజమౌళితో నా ప్రయాణం కొనసాగుతోందని దానయ్య చెప్పారు.
మర్యాద రామన్న సినిమా ఆఫర్ ఇచ్చారు కానీ ఇంకా పెద్ద సినిమా చేయాలని అనుకుంటున్నాను అని దానయ్య రాజమౌళితో చెప్పారు. రెండు ప్రాజెక్టులు అయిపోయాక చెప్తానని చెప్పారట. ఇలా ఈ విధంగా ఆర్ఆర్ఆర్ సినిమా నా చేతికి వచ్చిందని ఇంత పెద్ద స్థాయిలో తీస్తారని ఊహించలేదని చెప్పారు దానయ్య. కరోనా సమయంలో కష్టాలు పడ్డాం. బడ్జెట్ కూడా అనుకున్న దాని కంటే ఎక్కువ అయ్యింది.
నాటు నాటు ఒక్క పాటనే 30 రోజులు రిహార్సిల్ చేసి ఉక్రెయిన్ లో 17 రోజులు షూటింగ్ చేశామని దానయ్య చెప్పారు. అయితే ఆ కష్టానికి తగ్గ ఫలితమే ఆస్కార్ అని ఈరోజు ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా రాజమౌళిదే అని అన్నారు. ఆస్కార్ వచ్చిందని తెలుసుకున్నాక నేను రాజమౌళికి తో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను కానీ వాళ్ళు ఫంక్షన్ కారణంగా బిజీగా ఉన్నారని మాట్లాడలేకపోయారని దానయ్య చెప్పారు.
watch video :
End of Article