Ads
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహరాజ్ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలు సూపర్ హిట్స్ కావడంతో రవితేజ తదుపరి చిత్రాలపై ఆసక్తి పెరిగింది. ఇక ప్రస్తుతం రవితేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలకు, టీజర్ కి మంచి స్పందన వచ్చింది.
Video Advertisement
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. టీజర్‌లో రవితేజ యాక్షన్ యాంగిల్‌ను చూపించగా, ట్రయిలర్‌లో రవితేజ మార్క్ కామెడీ కనిపిస్తుంది. ఓ వైపు సాఫ్ట్ క్యారెక్టర్ మరోవైపు వైల్డ్ క్యారెక్టర్‌లలో రవితేజ నటన వేరే లెవల్లో ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. సుశాంత్‌కు కూడా ఈ సినిమాలో మంచి పాత్రే దక్కినట్లుంది. ముఖ్యంగా హర్షవర్ధన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను ఎక్కడితో తీసుకెళ్లిపోయింది.
‘మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా చేయడం ఆర్ట్.. ఐ యామ్ ఎన్ ఆర్టిస్ట్’ ‘ఈ భూమి మీద నన్నేవడైనా ఆపగలిగే వాడున్నాడంటే అది నేనే’ అనే డైలాగ్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మాస్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునే విధంగా ట్రైలర్‌ను బాగా కట్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. ట్రైలర్ గమనిస్తే రవితేజ లాయర్ పాత్ర పోషించినట్లు తెలుస్తుంది.
మరోవైపు ప్రస్తుతం రవితేజ ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఇటీవల వచ్చిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా వంద కోట్ల గ్రాస్ రాబట్టి అందరినీ మెప్పించింది. వంద కోట్ల క్లబ్బులో మొదటి సారిగా రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రావణాసుర సినిమాపై ఇప్పుడు మంచి బజ్ ఏర్పడింది. రావణాసుర సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే ఏప్రిల్ 7న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. అను ఇమాన్యుయేల్, ఫరియా, మేఘా ఆకాష్ నటిస్తోన్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
watch video :
End of Article