Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ అంతకుముందు కలిసి పని చేశారు. చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Video Advertisement
అయితే ఈ సినిమాపై ఇప్పటికి చాలా వార్తలు వచ్చాయి. “ఈ సినిమా కథ ఇలా ఉండబోతోంది” అంటూ, “మొదట ఒక కథ అనుకున్నారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల కథని మార్చేశారు” అని ఇలా చాలా వార్తలు వచ్చాయి. మొదట్లో ఒక యాక్షన్ సినిమా అనుకున్నారని, కానీ ఇప్పుడు ఏమో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఈ సినిమా రూపొందుతోంది అని అన్నారు.
కానీ ఇటీవల విడుదల చేసిన మహేష్ బాబు పోస్టర్ చూస్తే ఈ సినిమా కూడా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. అలాగే సినిమా నిర్మాతల్లో ఒకరు అయిన సూర్యదేవర నాగ వంశీ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటుంది అని చెప్పారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే శ్రీ లీల కూడా మరొక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది పెద్ద పెద్ద నటీనటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు 2 పాత్రల్లో కనిపిస్తారు అనే వార్త వచ్చింది. అది కూడా తండ్రిగా, కొడుకుగా 2 పాత్రల్లో నటిస్తారు అని అంటున్నారు. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల అవుతుంది అని చెప్పడంతో, ఈ సినిమాకి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహా రెడ్డి సినిమాకి పోలికలు ఉన్నాయి అంటూ కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి.
ఒకటి ఏంటంటే, ఈ సినిమాలో కూడా బాలకృష్ణ తండ్రి కొడుకుల పాత్రలో నటించారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా అలాగే నటిస్తారు అని అంటున్నారు. అలాగే వీర సింహా రెడ్డి సినిమా సంక్రాంతికి విడుదల అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా అలాగే సంక్రాంతికి విడుదల అవుతోంది. అంతే కాకుండా వీర సింహా రెడ్డి కూడా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగానే రూపొందింది.
ఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ఈ యాక్షన్ చాలానే ఉంటుంది అని అంటున్నారు. దాంతో, “ఒకవేళ ఇదే నిజం అయితే సంక్రాంతి సెంటిమెంట్ రిపీట్ అయ్యి మహేష్ బాబు ఖాతాలో కూడా ఒక పెద్ద హిట్ పడుతుంది” అని అంటున్నారు. కొంత మంది ఇలా అంటుంటే, కొంత మంది మాత్రం, “ఇది ఒక ప్రయోగం” అని, “త్రివిక్రమ్ ఇలాంటిది చేయడం మొదటి సారి” అని, దాంతో “కొంచెం జాగ్రత్తగా చేయాలి ఏమో” అని అంటున్నారు.
కానీ ఇంకొక వార్త ప్రకారం అయితే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు అని, ఆయన మహేష్ బాబు తాత పాత్రలో నటిస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు అయితే చాలా ప్రచారంలో ఉన్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే సినిమాకి సంబంధించి ఏదైనా ఒక విషయాన్ని సినిమా బృందం అధికారికంగా ప్రకటించేంతవరకు ఆగాల్సిందే.
End of Article