Ads
అదృష్టం వరించి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సంఘటనలు సినిమాల్లో నే జరుగుతాయి అనుకుంటాం. కానీ ప్రస్తుతం ఇటువంటి ఘటనలు మన కంటి ముందే జరుగుతున్నాయి. కోటీశ్వరులు కావాలంటే లాటరీ అయినా తగలాలి.. లేదంటే ఏదైనా టీవీ షోల్లో విజయమైనా సాధించాలి. కానీ సరదాగా ఆడిన ఒక ఆట తో కోటీశ్వరుడిగా మారదు ఈ బీహార్ యువకుడు.
Video Advertisement
ఒక్క ఆట ఈ వ్యక్తి జీవితాన్నే మార్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలు కావడమే ఆలస్యం చర్చలు వందల్లో నుండి కోట్లల్లో జరుగుతూనే ఉంటాయి. కాని ఆ డబ్బు గెలుచుకోనే అదృష్టం మాత్రం లక్షల్లో కొందరికి మాత్రమే దక్కుతుంది. ఇప్పుడు ఆ అదృష్టం బీహార్ లోని ఓ పేద యువకుడైన మంజయ్ కి దక్కింది.
సమస్తిపూర్ జిల్లా మోర్వ మండలం సారంగపూర్ పశ్చిమ పంచాయతీకి చెందిన యోగేంద్ర సాహ్ని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడి కుమారుడు మంజయ్ చిన్న చిన్న పనులు చేస్తూ.. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కానీ కుటుంబ కష్టాలు తీరేందుకు డబ్బు సంపాదించాలని బీహార్ నుంచి వలస అసోం కి వలస వెళ్ళిపోయాడు.
మంజయ్ గౌహతిలో పెయింటింగ్ పనులుకు వెళ్తున్నాడు. ఐతే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండడంతో.. మంజయ్ మిత్రులు డ్రీమ్11 కాంటెస్ట్‌లో పాల్గొనే వారు. వారిని చూసి మంజయ్ కూడా డ్రీమ్11లో చిన్న మొత్తం పెట్టి… కాంటెస్ట్‌ల్లో పాల్గొంటున్నాడు. ఇటీవల జరిగినే ఓ మ్యాచ్‌కి రూ.49 పెట్టి.. రెండు కోట్ల రూపాయల కాంటెస్ట్‌లో పాల్గొన్నాడు. తాను ఎంపిక చేసిన జట్టే.. అత్యధిక పాయింట్లు సాధించి.. నెంబర్ 1గా నిలవడంతో.. రెండు కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు మంజయ్.
ఆ మెసేజ్ చూసి మంజయ్ ఉబ్బితబ్బిపోయాడు. ఇందులో ప్రభుత్వ టాక్స్ కింద 30శాతం పోగా.. మిగిలిన కోటీ 40 లక్షలు మంజయ్ అకౌంట్ లో పడ్డాయి. రాత్రికి రాత్రే కోట్ల రూపాయల డబ్బు బ్యాంక్ ఖాతాలో పడడంతో కుటుంబం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు డ్రీమ్ 11 కాంటెస్ట్‌లో పాల్గొనలేరు. ఈ రెండు రాష్ట్రాల్లో డ్రీమ్11 వంటి యాప్స్‌పై నిషేధం అమల్లో ఉంది.
End of Article