Ads
ఒక సినిమా విడుదల అవుతోంది అంటే ఆ విడుదల అయ్యే తేదీ నిర్ణయించే ముందు చాలా ఆలోచనలు జరుగుతాయి. ఒకవేళ ఆ సినిమా విడుదల అయ్యే రోజు ఇంకొక సినిమా ఏమైనా విడుదల అవుతుందా? ఆ సినిమాలో హీరో ఎవరు? ఒకవేళ పెద్ద హీరో సినిమా అయితే వేరే సినిమాని ప్రేక్షకులు చూస్తారా? ఒకవేళ రెండు ఒకటే టైప్ సినిమాలు అయితే ప్రేక్షకులు రెండిట్లో ఏ సినిమా చూడాలి అని ఆలోచించి ఈ సినిమా చూడకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటివి చాలా ఆలోచిస్తారు.
Video Advertisement
అంతే కాకుండా కొన్ని తేదీలు సెంటిమెంట్ ప్రకారం కూడా డిసైడ్ చేస్తారు. అలా తెలుగు వాళ్ళు కూడా చాలా సినిమాలు విడుదల చేసేముందు ఇలాంటివి ఒక్కొక్కసారి చూసుకుంటారు. అని కొన్నిసార్లు మాత్రం అనుకోకుండానే అలా ఒక బ్లాక్ బస్టర్ సినిమా విడుదల అయిన తేదీ రోజు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సినిమా విడుదల అవుతుంది.
మన తెలుగులో కూడా అలా చాలానే సినిమాలు విడుదల అయ్యాయి. అలా ఏప్రిల్ 28 రోజు కూడా చాలా బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే రోజు ఏజెంట్ సినిమా కూడా విడుదల అవుతోంది. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నారు. అసలు ఏప్రిల్ 28వ తేదీ నాడు విడుదల అయిన సినిమాలు ఏవో, వాటి రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 అనార్కలి – 1955
అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన అనార్కలి సినిమా ఏప్రిల్ 28, రోజు 1955లో విడుదల అయ్యింది. అప్పట్లో ఈ సినిమా ఎంత గొప్ప ప్రేమ కథ అనే గుర్తింపు తెచ్చుకుంది అనేది అందరికీ తెలిసిందే.
#2 అడవి రాముడు – 1977
నందమూరి తారక రామారావు గారు నటించిన అడవి రాముడు సినిమా కూడా ఏప్రిల్ 28, 1977లో విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా అప్పట్లో చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
#3 యమలీల – 1994
ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల కూడా ఏప్రిల్ 28, 1994 లో విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని టాక్ తెచ్చుకుంది.
#4 పోకిరి – 2006
ముందున్న సినిమాలు అన్ని కొంచెం పాత సినిమాలు. కాబట్టి అవి విడుదల అయినప్పుడు ఉన్న పరిస్థితి గురించి అందరికీ తెలిసే అవకాశం ఉండదు. కానీ మహేష్ బాబుని పెద్ద స్టార్ హీరోగా చేసిన పోకిరి సినిమా విడుదల అయిన తర్వాత ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోకిరి సినిమా కూడా ఏప్రిల్ 28, 2006లో విడుదల అయ్యింది. ఇప్పటికి కూడా ఈ సినిమాకి ఉన్నంత క్రేజ్ కొన్ని కొత్త సినిమాలకి కూడా ఉండదు ఏమో అనిపించే రకంగా ఉంటుంది.
#5 బాహుబలి – ద కంక్లూషన్ – 2017
తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి – ద కంక్లూషన్ కూడా అదే రోజు విడుదల అయ్యింది. అప్పటి వరకు తెలుగు సినిమా అంటే ఒకలాగా చెప్పుకునే వారు, తర్వాత తెలుగు సినిమా అంటే ఎంతో గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు.
#6 ఏజెంట్ – 2023
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా కూడా ఇదే తేదీ రోజు విడుదల అవుతోంది. ముందు సినిమాల రిజల్ట్ చూసుకుంటూ ఉంటే ఈ సినిమా కూడా అలాగే ఉంటుందేమో అని అనిపిస్తోంది అని కామెంట్స్ వస్తున్నాయి.
అఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సినిమాకి సంబంధించి ఒక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వీడియో కూడా విడుదల చేశారు. ఈ సినిమా కోసం సినిమా బృందం అంతా కూడా హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండేలాగా చాలా ఆలోచిస్తున్నారు అని అర్థం అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే.
End of Article