“ఆస్కార్” వరకు వెళ్ళింది.. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది..! అసలు ఏం ఉంది ఈ సినిమాలో..?

“ఆస్కార్” వరకు వెళ్ళింది.. ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది..! అసలు ఏం ఉంది ఈ సినిమాలో..?

by kavitha

Ads

మలయాళ డైరెక్టర్ లిజో జోస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జల్లికట్టు. ఈ మలయాళ చిత్రం రిలీజ్ కు ముందే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది.

Video Advertisement

టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్, బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‏లో ప్రదర్శిచారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో జోస్ పెల్లీస్సరీ జల్లికట్టు చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడి అవార్డును కూడా అందుకున్నారు. ఈమూవీ సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం..
 జల్లికట్టు సినిమా 93వ అకాడెమీ అవార్డుల రేసులో నిలిచింది. చివరి రౌండ్ కు అర్హత సాధించలేకపోయింది. 2021 ఆస్కార్ కోసం మొత్తం 27 చిత్రాలు పోటీపడగా, మలయాళ సినిమా ‘జల్లికట్టు’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసింది. మలయాళ ఇండస్ట్రీ నుండి ఆస్కార్ కు వెళ్ళిన మూడవ సినిమాగా నిలిచింది.
సినిమా అనగానే ముందుగా అడిగే ప్రశ్న అందులో హీరో ఎవరు అనే. దాదాపుగా ప్రతి సినిమాలోనూ హీరోదే ప్రధాన పాత్రగా ఉంటుంది. ఆ హీరో పేరుతోనే సినిమాని జనాల్లోకి తీసుకెళ్తుంటారు. కానీ ‘జల్లికట్టు’ సినిమాలో హీరో అనే పాత్ర లేదు. హీరోని పెట్టకుండా సినిమాని తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. దర్శకుడు ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. 2019లో విడుదలైన ఈ సినిమా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్ర కథ గురించి చెప్పాలంటే కసాయి కొట్టు నుండి తప్పించుకున్న ఒక దున్నపోతు ఊర్లో ఎంతటి వినాశనం సృష్టించిందనేది స్టోరి. ఇక ఈ మూవీ అంతా దున్నపోతు చుట్టూ తిరిగుతుంది. కానీ ఈ సినిమాలో దున్నపోతును ఉపయోగించలేదు. చిత్రయూనిట్ యానిమేట్రానిక్స్ టెక్నిక్ ద్వారా దున్నపోతును చూపించారంట. ఇలా ఒక్కో దున్నపోతుకు దాదాపు 20 లక్షలు ఖర్చు అయ్యినట్టు తెలుస్తోంది.‘జల్లికట్టు’ అనేది కసాయి నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక దున్నపోతు ఉత్కంఠగా పరిగెత్తే కథను చెప్పే సినిమా. దున్నపోతును పట్టుకోవడానికి మనుషులు వెంట పడటం చూస్తే ఆదిమ మానవుల నాటి పశు ప్రవృత్తి  మనిషి జీన్స్ లో ఇంకా ఉందని, అవకాశం వచ్చినప్పుడు అది బయిటకు వస్తుందని అర్దమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: “సల్మాన్ ఖాన్” హీరోగా నటించిన మరొక రీమేక్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

 


End of Article

You may also like