యాడ్స్ లో క్లీనింగ్ ప్రొడక్ట్స్ మీద 99 .99 % అని ఎందుకు ఇస్తారు..? 100 % ఎందుకు కాదు..? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..??

యాడ్స్ లో క్లీనింగ్ ప్రొడక్ట్స్ మీద 99 .99 % అని ఎందుకు ఇస్తారు..? 100 % ఎందుకు కాదు..? దీని వెనుక ఉన్న కథ ఏంటంటే..??

by Anudeep

Ads

మీరు మీ ఇంటి స‌భ్యుల‌ను అనేక వ్యాధుల నుంచి రక్షించాలనుకుంటే, మీ ఇంటిని శుభ్రంగా ఉంచడం ముఖ్యం. దీనికి ఫ్లోర్ క్లీనర్ లు సహాయపడతాయి, ఇవి సాధారణ ఫినైల్ కంటే 10 రెట్లు ఎక్కువ పరిశుభ్రతను అందిస్తాయి.

Video Advertisement

జెర్మ్స్ నుంచి రక్షణను అందిస్తాయి. బాత్రూమ్, కిచెన్ ఫ్లోర్, సింక్, టైల్, కిచెన్ కౌంటర్ టాప్ మొదలైన వాటిని శుభ్రంగా ఉంచుతాయి.ఈ ఫ్లోర్ క్లీనర్ లు గ‌చ్చు మీద ప‌డిన కాఫీ, కెచప్, సాస్ వంటి కఠినమైన మరకలను కూడా పూర్తిగా తొలగిస్తాయి.

why floor cleaners ads shows 99.99 % germ protection..!!

ఇలా ఫ్లోర్ క్లీనర్లకి సంబంధించిన అనేక ప్రొడక్ట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అలాగే వాటి యాడ్స్ కూడా మనం చూస్తాం. అయితే ఈ యాడ్స్ అన్నిటిలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. మనం దాన్ని గుర్తించి ఉంటాం. అదేంటంటే.. అన్ని క్లీనర్లు 99 .99 % శాతం క్రిములని తొలగిస్తాయి అని చెప్తారు.

why floor cleaners ads shows 99.99 % germ protection..!!

“అదేంటి? ఎందుకు 100 % శాతం క్రిములని చంపదు?” అని మనం ఆలోచించము. ఒకవేళ వంద శాతం క్రిములని సంహరిస్తుంది అని ఉత్పత్తిదారులు హామీ ఇస్తే వినియోగదారులకు ఎటువంటి రోగాలు రావు అని ఒప్పుకున్నట్టే.. అందుకే అటువంటి హామీ ఇవ్వరు. అలాగే అన్ని రకాల ఫ్లోర్ క్లీనర్లు ఒకేలా ఉంటాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఒక్కొక్క రకం వేర్వేరు రసాయనాలను కలిగి ఉంటుంది.

why floor cleaners ads shows 99.99 % germ protection..!!

ఒక ఫ్లోర్ మీద జెర్మ్స్ లేకపోవడాన్ని స్టెరిలైజేషన్ అంటారు. కానీ EPA-నమోదిత రసాయన స్టెరిలెంట్‌లు మాత్రమే అన్ని రకాల వ్యాధికారక క్రిములను చంపగలవు. అందుకే ఒక ఫ్లోర్ క్లీనర్ ని కొనేప్పుడు వెనకాల రాసి ఉండే వివరాలను కూడా చదవాలి. అలాగే వాటిని కొనేటప్పుడు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

# ఫ్లోర్ క్లీనర్ ని కొనేప్పుడు  థర్డ్-పార్టీ సర్టిఫికేషన్‌ల కోసం చూడాలి.

# అలాగే ఏ అవసరం కోసం క్లీనర్స్ ని కొంటున్నారా వాటికి సరిపడే రకాలను మాత్రమే కొనాలి. ఒ

# కటి కంటే ఎక్కువ పనుల కోసం తయారు చేసే ఉత్పత్తులు పలుచగా ఉండి.. తక్కువ ప్రభావం చూపుతాయి.


End of Article

You may also like