Ads
కోడి రామ్మూర్తి నాయుడు అంటే నేటి తరం వారికి అంతగా తెలియకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ మల్లయుద్ధ యోధుడు. కలియుగ భీముడిగా పేరుగాంచిన కోడి రామ్మూర్తి దేశవిదేశాల్లో ఎన్నో సాహస కృత్యాలు ప్రదర్శించారు.
Video Advertisement
అలా ఆయన ప్రదర్శనలు ఇచ్చిన ప్రతిచోటా రామ్మూర్తికి అనేక బిరుదులు, బహుమతులు ఇచ్చేవారు. మల్ల మార్తాండ, ఇండియన్ హెర్క్యులస్‌గా ఇతర దేశాల్లో భారత దేశ కీర్తిని చాటిన కోడి రామ్మూర్తి జీవితచరిత్ర వెండితెర పై రావడానికి సిద్ధమవుతోంది. ఆయన గురించి తెలుకుందాం..
కోడి రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం అనే గ్రామంలో 1883లో నవంబర్ 3న జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన రామ్మూర్తి తండ్రి స్పూర్తితో బాబాయి కోడి నారాయణస్వామి వద్ద పెరిగారు. అక్కడ ఉండే ఒక వ్యాయామశాలలో చేరి కుస్తీ నేర్చుకుంటూ దేహధారుడ్యాన్ని పెంచుకునేవాడు. 21 ఏళ్ల వయసులోనే చెస్ట్ పై 1 1/2 టన్నుల బరువును మోసేవారు. ఆ తరువాత మూడు టన్నుల బరువు కూడా మోసేవారు.మద్రాసులో ఒక కాలేజిలో ఏడాది వ్యాయామశాలలో ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ అందుకుని వ్యాయామ ఉపాధ్యాయుడుగా తాను చదివిన విజయనగరంలో హైస్కూలులోనే చేరారు. అక్కడే తన మిత్రుడు పొట్టి పంతులు సహాయంతో సర్కస్ కంపెనీ పెట్టారు. తుని రాజాగారి సహకారం కూడా లభించింది. రామమూర్తి సర్కస్ కంపెనీ చాలా చోట్ల ప్రదర్శనలిచ్చి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.
1912లో మద్రాసుకు చేరుకున్నారు. చైనా, జపాన్ కళాకారుల సహకారంతో కోడి రామ్మూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంది. వీటిలో భాగంగా రామ్మూర్తి గట్టిగా గాలి పీల్చుకుని కండలను బిగించి, ఛాతీకి చుట్టిన ఉక్కు తాళ్ళను సైతం తెంచేవారు. ఆయన తన చెస్ట్ పై ఏనుగును ఎక్కించుకుని 5 నిముషాల పాటు అలాగే ఉండేవారు. ఆయన 2 కార్లను తాళ్ళతో కట్టి 2 చేతులుతో పట్టుకుని వాటిని కదలకుండా ఆపేవారు. అంతే కాకుండా ఒక్క చేత్తోనే రైల్ ఇంజను ఆపేవాడు. ఆ రోజుల్లోనే లండన్ కు వెళ్లి అక్కడ బకింగ్ హామ్ ప్యాలెస్ లో కుస్తీ పోటీలో సత్తా చాటాడు.అప్పుడే బ్రిటిష్ రాణి రామ్మూర్తికి ఇండియన్ హెర్క్యులెస్ అనే బిరుదు ఇచ్చి సత్కరించింది. ఆయన జీవితంలో ఎన్నో బిరుదులు అందుకున్నారు. అంత గొప్ప మల్లయుద్ధ యోధుడు కోడి రామ్మూర్తి జీవిత కథ పై త్వరలోనే ఒక సినిమా రానుందని తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న RC16 మూవీ కోడి రామ్మూర్తి బయోపిక్ ఆని సమాచారం.
Also Read: వెంకటేష్ “సంక్రాంతి” నుండి… నాని “దసరా” వరకు… “పండగ” పేర్లని టైటిల్ గా పెట్టుకున్న 12 సినిమాలు..!
End of Article