Ads
ఢీ డ్యాన్స్ షోలో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న చైతన్య బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన మరణంతో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Video Advertisement
చైతన్య మరణం పై పలువురు టీవి సెలెబ్రెటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్ మాస్టర్ చైతన్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ చైతన్య మరణం పై స్పందించారు.
కొరియోగ్రాఫర్ చైతన్య బలవన్మరణానికి ఆర్ధిక ఇబ్బందులే కారణం అని తెలుస్తోంది. అప్పుల బాధను భరించలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణం తీసుకుంటున్నట్లు మరణానికి ముందు చైతన్య సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో తన బలవన్మరణానికి కారణాలను వెల్లడించాడు. కొరియోగ్రాఫర్‌గా మంచి భవిష్యత్ ఉన్న డాన్స్ మాస్టర్ చైతన్య ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం అందరినీ కలిచివేసింది.
చైతన్య మరణం పై పలువురు టెలివిజన్ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్త పరుస్తున్నారు. ఈ క్రమంలో చైతన్య మాస్టర్ మరణం పై డ్యాన్సర్ కండక్టర్ ఝాన్సీ తాజాగా స్పందించారు. ఆయన మరణం పై విచారం వ్యక్తం చేసింది. చైతన్య తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో ఆయన ఫ్యామిలీ అంతా బాధపడుతోంది. చైతన్య డబ్బులు ఇవ్వవలసిన వారితో కూర్చుని తన పరిస్థితి వివరించినట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని అన్నారు.
అందరూ చైతన్యతో కలిసి జర్నీ చేసినవారే. అందులోనూ కళాకారులు వేధించే అంత కఠినమైనవారు కాదు. ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో, చైతన్య తోటివారికి సహాయం చేసేవాడని తెలిపింది. నాలుగు రోజుల క్రితమే డాన్స్ మాస్టర్ చైతన్యను కలిసి ఢీ డ్యాన్స్ షోలో తనకు ఛాన్స్ ఇవ్వమని అడిగానని, దానికి ఆయన నెక్స్ట్ సీజన్ లో తప్పకుండా అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన తన కింద ఉన్న డాన్సర్లకు కూడా చాలా గౌరవం ఇస్తారని డ్యాన్సర్ ఝాన్సీ తెలిపారు.
Also Read: ప్రేమ వ్యవహారం… ఇప్పుడు రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే..? అసలు ఏం జరిగిందంటే..?
End of Article