Home Filmy Adda బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్న సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’..!! ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా..??

బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తున్న సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’..!! ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా..??

by Anudeep

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన మొదటి సినిమా విరూపాక్ష. హిట్లు ప్లాప్ లతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు విడుదలైన రోజు నుంచి ఊహించని విధంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

 

 

సాయి ధరమ్ తేజ్ సినీ కెరీర్ లో 15వ చిత్రంగా వచ్చిన ఈ మూవీ తో కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మించాయి.విడుదలకు ముందే ఈ చిత్రానికి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ. 22.20 కోట్ల బిజినెస్ అయింది.

10 days collections of saidharam tej virupaksha movie..!!

దానికి తగ్గట్టే ఈ చిత్రం అంచనాలను అందుకుంది. విరూపాక్ష సినిమాకు అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ పది రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లోనే రూ. 37.76 కోట్లు షేర్‌, రూ. 76 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. అంటే ఈ సినిమాకు రూ. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కాగా రూ. 14.76 కోట్ల లాభంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

10 days collections of saidharam tej virupaksha movie..!!

ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రీసెంట్ గా వచ్చిన రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి.

10 days collections of saidharam tej virupaksha movie..!!

మొదటి రోజే 12 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా. . కేవలం నాలుగు రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పది రోజుల్లో ఏకంగా విరూపాక్ష సినిమా 76 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి అందరికి షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

You may also like