Ads
వరుస ప్రాజెక్ట్స్ కి సైన్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2023 చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు షూటింగ్స్ పూర్తవ్వాలని వరుస షెడ్యూల్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే వినోదయ సితం సినిమా రీమేక్ షూట్ పూర్తి చేసేసిన పవన్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేసారు.
Video Advertisement
అలాగే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హైప్ ఉన్న సినిమా OG కూడా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేశారు పవన్ కళ్యాణ్. అయితే తాజాగా గబ్బర్ సింగ్ విడుదలై 11 ఏళ్లు అయిన సందర్భంగా ఉస్తాద్ మూవీ గ్లింప్స్ ని విడుదల చేస్తామంటూ చిత్రబృదం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 4.59 గంటలకు సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారు.
అయితే గ్లింప్స్ విడుదలకు కొన్ని గంటల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు దర్శకుడు హరీష్ శంకర్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో విడుదల చేసిన కాసేపటికే ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఫస్ట్ లుక్ లో పవన్ స్టైలిష్ గా నించొని ఉన్నాడు. పోలీసులు అడ్డం పెట్టే బ్యారికేడ్ కు ఆనుకొని ఉన్నాడు. వెనకాల కొంతమంది మనుషులు నించొని ఉన్నారు. ఫోటో చూస్తుంటే ఏదో ఫైట్ సీన్ కి సంబంధించిందని అర్ధమవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ ఈ పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టర్‌పై ‘ఈ సారి ఇది ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు’ అని రాసి మరీ సినిమాపై అంచనాలను అమాంతం పెంచారు.
ఇక ఈ మూవీ లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ‘తేరీ’ మూవీకి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article