Ads
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ సినిమా ఒప్పుకున్న అది సెన్సేషన్ అవుతోంది. ఇప్పటికే వరుస ప్రాజెక్ట్స్ సైన్ చేసిన పవన్.. 2023 చివరికల్లా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే వినోదయ సితం సినిమా రీమేక్ షూట్ పూర్తి చేసేసిన పవన్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేసారు.
Video Advertisement
అలాగే సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హైప్ ఉన్న సినిమా OG కూడా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసేశారు పవన్ కళ్యాణ్. ఇక ఉస్తాద్ మూవీ విషయానికి వస్తే సరిగ్గా 11 ఏళ్ళ విరామంగా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ వీరిద్దరూ కలిసి చేస్తోన్న మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ఈ రోజుతో గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయి 11 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని విడుదల చేసారు మేకర్స్. పాతబస్తీలో పోలీస్ అధికారిగా పవన్ కళ్యాణ్ కనిపించారు. లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్… ‘ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది’ అని చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పాలి.
గ్లింప్స్‌ను గమనిస్తే.. ప్రతి యుగంలో అధర్మం పెరిగినప్పుడు దేవుడు అవతరిస్తాడని చెప్పే భగవద్గీతలోని శ్లోకంతో గ్లింప్స్ స్టార్ట్ అయ్యింది. పవన్ తనదైన మాస్ లుక్‌తో కనిపించారు. మహంకాళి పోలీస్ స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీలోని ఎస్సైగా ఈసారి పవన్ హీరోయిజం చూపించబోతున్నారని క్లియర్‌గా తెలుస్తోంది. ఈ గ్లింప్స్ తో మూవీ పై అంచనాలు పెంచేశారు హరీష్ శంకర్.
ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ ఫస్ట్ లుక్ గ్లింప్స్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :
End of Article