Ads
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా చిత్రీకరించారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. టీజర్ విషయం లో విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ ట్రైలర్ తో ఆ విమర్శలు తిప్పికొట్టింది.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ ఏడాది జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇక ఫైనల్ గా జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
అయితే తాజాగా రిలీజ్ అయిన ఓ పోస్టర్ పై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఇంకా నెల రోజుల్లో ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకి రానుంది అంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. అందులో హనుమంతుడు గాలిలో ఎగురుతుండగా ఆయనపై కూర్చొని రాముడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ షాట్ లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. రామాయణం కాలంలో బహుళ అంతస్తుల బిల్డింగ్స్ ఎక్కడ నుండి వచ్చాయని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హాలీవుడ్ పోస్టర్స్ తీసుకొని ఎడిట్ చేశారని అందుకే ఇలా దొరికిపోయారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇక ఆదిపురుష్ మూవీలో రాముని గెటప్ కాపీ అంటూ ఓ ఆర్టిస్ట్ ఆరోపణలు చేశారు. నేను క్రియేట్ చేసిన రాముని రూపాలు అనుమతి లేకుండా దర్శకుడు వాడాడని సదరు ఆర్టిస్ట్ విమర్శలు గుప్పించారు. ఇలా ఒక వివాదం తర్వాత మరొకటి ఆదిపురుష్ మూవీ ని చుట్టుముడుతున్నాయి.
End of Article