ప్రముఖ నటుడు “శరత్ బాబు” కి సంతానం ఉన్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

ప్రముఖ నటుడు “శరత్ బాబు” కి సంతానం ఉన్నారా? ఇప్పుడు ఏం చేస్తున్నారు..?

by kavitha

Ads

ప్రముఖ నటుడు శరత్‌బాబు మే 22 న కన్నుమూసిన విషయం తెలిసిందే.  నాలుగున్నర దశాబ్దాల పాటు కొనసాగిన నటుడు శరత్ బాబు. ఆయన ఒక్క తెలుగులోనె కాకుండా కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో నటించిన తన నటనతో ఆకట్టుకున్న నటుడు శరత్ బాబు.

Video Advertisement

1973లో పరిశ్రమలో అడుగుపెట్టిన శరత్ బాబు 2023 వరకు నట ప్రస్థానాన్ని కొనసాగించారు. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన సినీ కెరీర్ విజయవంతంగా సాగినా, శరత్ బాబు వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.
పెళ్లి అనే విషయం శరత్ బాబుకు అంతగా కలిసి రాలేదని చెప్పవచ్చు. ఇద్దరిని అఫిషియల్ గా పెళ్లి చేసుకున్నా, సీక్రెట్‌గా వేరొకరితో కాపురం చేసినట్లుగా ఇండస్ట్రీలో టాక్ ఉంది. శరత్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టిన సమయానికే తెలుగు ఇండస్ట్రీలో రమాప్రభ స్టార్ కమెడీయన్‌గా వెలుగొందుతున్నారు. ఆమె శరత్ బాబు కన్నా వయసులో 4 ఏళ్లు పెద్దది. అయినపట్టికి ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అలా వారు 14 సంవత్సరాల పాటు చాలా అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని కొనసాగించారు.
ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెట్టడంతో విడాకులు తీసుకున్నారు. తరువాత శరత్ బాబు తమిళ యాక్టర్ నంబియార్ కుమార్తె స్నేహలతను వివాహం చేసుకున్నారు. కానీ ఆయన కొన్నాళ్లకే స్నేహలతతో కూడా విడిపోయారు. ఆ తరువాత కొంతకాలం ఒంటరిగా ఉన్న శరత్ బాబు, హీరోయిన్ నమితను రహస్యంగా వివాహం చేసుకున్నారనే ప్రచారం కొలీవుడ్, టాలీవుడ్‌ లో విస్తృతంగా జరిగింది.అయితే శరత్ బాబు అప్పట్లో ఈ వార్తలను ఖండించినా ఆ రూమర్స్ ఆగలేదు. శరత్ బాబును ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీకు పిల్లలు లేరా అని అడిగినపుడు దానికి ఆయన తన సోదరులు, అక్కాచెల్లెల పిల్లలు అంతా కలిసి 25 మంది అని,  వారంతా కూడా తన పిల్లలే అని చెప్పారు. శరత్ బాబు మరణించిన రోజు నుండే అతని బంధువులు ఆస్తుల కోసం తగాదా పడుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే మరో వైపు శరత్‌బాబుకు మాజీ భార్య స్నేహ నంబియార్‌తో ఇద్దరు పిల్లలు ఉన్నారని,  సాయి కార్తీక్ అనే  కుమారుడు, పల్లవి అనే కుమార్తె ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలా కొంతమంది ఆయనకు పిల్లలు లేరని, మరి కొంతమంది పిల్లలు ఉన్నారని అంటున్నారు.

Also Read: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న ‘గోపీచంద్’ “రామ‌బాణం” మూవీ.. ఎప్పుడు రాబోతుందంటే..!!


End of Article

You may also like