Ads
ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక పై 2000 రూపాయల నోట్లను కస్టమర్లకు ఇవ్వకూడదని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలను ఇచ్చింది. అలాగే 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు సెప్టెంబరు 30వ తేదీ వరకు సమయం ఇచ్చారు.
Video Advertisement
2016 లో 500, 1000 రూపాయల నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా వాటిని కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే నాని హీరోగా 2017 వచ్చిన నేను లోకల్ మూవీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటారా.. ఎందుకంటే ఈ మూవీ లోని ‘ సైడ్ ప్లీజ్’ సాంగ్ లో నాని 2000 రూపాయల నోట్ల గురించి ప్రస్తావించాడు. ” 1000 నోటు.. పింక్ నోటు వస్తుంటాయి.. పోతుంటాయి.. 100 నోరు పర్మనెంట్..” అంటూ ఆ సాంగ్ లో ఉంది. దీంతో ఈ విషయం అని అప్పుడే చెప్పాడు.. మనమే తెలుసుకోలేకపోయాం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే దేశంలో నోట్ల రద్దుకు బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలకు ముడిపెడుతు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన విషయమ తెలిసిందే. ఈ మూవీ కోలీవుడ్ లో 2016 మార్చి 4న రిలీజ్ అయ్యింది. తెలుగులో అదే ఏడాది మే 13న విడుదల అయ్యింది. ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయిన దాదాపు 5 నెలలకు పీఎం మోదీ ఇండియా లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
ఇక తమ దగ్గరున్న 2000 నోట్లను సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులలో జమ చేయడం, లేదా మార్చుకోవడం చేయాలని ఆర్బీఐ సూచించింది. కానీ రోజుకు ఇరవై వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చు. జమ చేయడం అయితే ఎంత అయిన చేసుకోవచ్చు. ‘క్లీన్ నోట్ పాలసీ’ లో భాగంగానే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే డిసిషన్ తీసుకన్నామన్న ఆర్బీఐ తెలిపింది. ఇక ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి.
https://www.instagram.com/reel/CsdynWppyeh/?igshid=NTc4MTIwNjQ2YQ%3D%3D
End of Article