Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బోలెడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Video Advertisement
అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి మే 31న ఓ ఖతర్నాక్ అప్ డేట్ వస్తోన్న సంగతి తెలిసిందే..ఈ మే 31 ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ ట్రీట్ కి ముందు అయితే మేకర్స్ మరో సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుండి తాజాగా మహేష్ బాబు పవర్ఫుల్ మాస్ పోస్టర్‌ని రిలీజ్ చేసారు మేకర్స్. ఈ పోస్టర్‌లో మహేష్ తలకు స్కార్ప్ కట్టుకుని భూదేవిని ముద్దాడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్.. మాస్ స్ట్రైక్ మరొక రెండు రోజుల్లో విడుదల కానుందని ఈ పోస్టర్‌లో మేకర్స్ ప్రకటించారు.
గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా టైటిల్ విషయంలో కాస్త సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సస్పెన్స్‌ను ఈ నెల 31తో తెరదించనున్నారని తెలిసింది.ఈ సినిమాకు గుంటూరు కారం అనే కూల్ టైటిల్ ఖరారు అయ్యిందని ఇన్ సైడ్ వర్గాల నుంచి సమాచారం. అయితే లాస్ట్ మినిట్ లో కొత్త టైటిల్ ఏమన్నా మారుతుందేమో తెలియాలి. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18
End of Article