Ads
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి మహిళల వరకు లెగ్గింగ్స్, జెగ్గింగ్స్, జీన్స్ ఎక్కువగా ధరిస్తున్నారు. వివాహం అయిన ఆడవారు కూడా ఎక్కువగా వీటినే ధరించడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారు.
Video Advertisement
చాలా మంది మహిళలు వీటిని ఇష్టపడటానికి, ఎటువెళ్ళిన వీటినే వాడడానికి కారణం అత్యంత సౌకర్యవంతంగా ఉండడం, అందుబాటులో ఉండడం. అయితే వీటిని ధరించడం వల్ల సౌకర్యంతో పాటు సమస్యలు ఉన్నాయనని నిపుణులు అంటున్నారు. మరి ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మొదట్లో అయితే తెలుపు, నలుపు రంగులలో మాత్రమే లభించేవి. ప్రస్తుతం మార్కెట్ లో అన్ని రకాల రంగులు దొరుకుతున్నాయి. దాంతో ఎక్కువగా వీటినే వాడుతున్నారు. ప్రస్తుతం మహిళలు ధరించే ప్యాంట్ లలో ఇవి ఎక్కువగా పాపులర్ అయ్యాయి. వారి దృష్టిలో ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత సౌకర్యవంతమైన ప్యాంటు అంటే లెగ్గింగ్స్ అని చెప్పవచ్చు.
అయితే లెగ్గింగ్స్ ధరించడం వల్ల సౌకర్యం ఉన్నప్పటికి కొన్ని సమస్యలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. లెగ్గింగ్స్ అనేవి చాలా బిగుతుగా, చర్మానికి అంటిపెట్టుకుని ఉంటాయి. అందువల్ల ఎక్కువ సమయం వీటిని ధరించడం వల్ల గాలి వెళ్ళే అవకాశం లేకపోతే చర్మ సమస్యలు వస్తాయని అంటున్నారు. ఎందుకంటే ఇవి భారత దేశంలో వాతావరణ పరిస్థితులకు సపోర్ట్ చేసే దుస్తులు కాదు.
ఇండియాలో శరీరానికి గాలి తగలవలసిన అవసరం ఉన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. చలికాలంలో వెచ్చని బట్టలు అవసరం ఉంటుంది. లెగ్గిన్స్ క్లాత్ చాలా పలుచగా ఉంటుంది. దాంతో చల్ల గాలి తాకి చర్మ సంబంధిత సమస్యలు రాషెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి వస్తాయి. వీటి వాడకం వల్ల చలి, ఎండ, పొల్యూషన్ వల్ల చర్మం మాత్రమే కాకుండా బాడి కూడా ఎఫెక్ట్ అవుతుందని చెబుతున్నారు.
పెళ్లి అయిన ఆడవాళ్లు,పెళ్లి వయసు వచ్చిన ఆడవాళ్లు, అంటే యుక్త వయసు వచ్చిన ఆడవాళ్లు లెగ్గిన్స్ వాడక పోవడమే మంచిది. ఎందుకంటే సాధారణంగా ఈ వయసు ఆడవారికి, అందులోనూ ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారికి ఇంట్లో చాలా బాధ్యతలు ఉంటాయి. అలాగే బయట కూడా చాలా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
అలాంటి సమయంలో సౌకర్యంగా ఉండే దుస్తులు వేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఇలా గాలి చొరబడకుండా ఉండే వస్త్రంతో తయారు చేసిన దుస్తులని వారు వేసుకోకపోవడమే మంచిది అని, ఎందుకంటే అవి వేసుకున్నప్పుడు సౌకర్యంగా ఉండకపోవడం వల్ల పనిపై శ్రద్ధ పెట్టలేకపోయే అవకాశం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. అందుకే పెళ్లి అయిన ఆడవారు లెగ్గింగ్స్, జీన్స్ వాడకపోవడమే ఉత్తమం అని అంటున్నారు.
Also Read: “నైటీలు” పగలు వేసుకోవడం వల్ల కలిగే ఈ నష్టాల గురించి తెలుస్తే…ఆడవాళ్ళు ఇంకోసారి ఆ తప్పు చేయరు.!
End of Article