Ads
సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబో తెరకెక్కుతున్న “గుంటూరు కారం” సినిమా నుండి తాజాగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ తో ఒక్కసారిగా వారిలో ఉత్సాహం మరింత పెరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గుంటూరు కారం గురించిన చర్చే జరుగుతోంది.
Video Advertisement
గత కొన్ని రోజులుగా ఈ మూవీ టైటిల్ గురించిన వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఫైనల్ గా వచ్చిన వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అదే టైటిల్ ను ఖరారు చేశారు. దాంతో పాటే గ్లింప్స్ లో మహేష్ ను ఊర మాసుగా చూపించి ఫ్యాన్స్ ను సంతోషపెట్టారు. అయితే ఈ వీడియోలో మరో స్టార్ హీరో కూడా ఉన్నారు. ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
ద మోస్ట్ అవేటెడ్ మూవీగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. తాజాగా విడుదల అయిన గ్లింప్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిస్తోంది. బీడీ తాగుతూ, కర్ర తిప్పుతూ, ఊర మాసు లెవెల్ లో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు స్వాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది.
రిలీజ్ అయ్యి 24 గంటలు కాకముందే 20 మిలియన్ల వ్యూస్ పొంది, రికార్డుల దిశగా మహేష్ ‘గుంటూరు కారం’ గ్లింప్స్ దూసుకెళుతోంది. అయితే ఈ వీడియోలో మరో నటుడు కూడా ఉన్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరికి ఈ విషయంలో అతడు మూవీలోని ఎమ్ ఎస్ నారాయణ పాపులర్ డైలాగ్ గుర్తుకువస్తోంది.
ఎందుకంటే ఈ వీడియోలో త్రివిక్రమ్ మరో యాక్టర్ ను చూపించి, చూపించనట్టుగా చూపించారని నెటిజెన్లు అంటున్నారు. ఆ నటుడు ఎవరో కాదు జగపతిబాబు. ఒకప్పుడు ఫ్యామిలి హీరోగా అలరించిన, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా రాణిస్తున్నారు. ఈ చిత్రంలో తాను భయంకరమైన విలన్ గా నటిస్తున్నట్టు ఇటీవల ఆయనే ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు. ఇక గుంటూరు కారం గ్లింప్స్ జగపతిబాబు ఉన్నారని అంటున్నారు. ఈ గ్లింప్స్ లో 27 సెకన్ల వద్ద మహేశ్‌తో పాటుగా జగపతిబాబు కనిపించాడు. కానీ అది బ్లర్ ఎఫెక్ట్‌లో ఉంది. మహేష్ సిగరెట్ వెలిగిస్తున్నపుడు, కాలుస్తున్నప్పుడు పక్కనే జగపతిబాబు ఉన్నారు. వీడియోను ఆపి చూస్తే జగపతిబాబు అని తెలుస్తుంది. అలాగే గాల్లోకి జీప్ లేచినపుడు చెవులు మూసుకున్న వ్యక్తి జగపతిబాబు అని తెలుస్తోందని నెటిజెన్లు అంటున్నారు.
Also Read: ఏంటి తమన్ అన్నా… “గుంటూరు కారం” BGM కూడా కాపీయేనా..? ఏ సినిమా నుండి అంటే..?
End of Article