Ads
ఒక మూవీని నిర్మించడం అనేది ప్రొడ్యూసర్ కు ఒక యజ్ఞం వంటిది. నిర్మాత తన సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టడం లేదంటే ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకురావడం వంటివి చేస్తుంటారు. అయితే ఆ మూవీ విజయం సాధించి, మంచి వసూళ్లు వస్తేనే ఇండస్ట్రీలో కొనసాగడం సాధ్యం అవుతుంది. లేదంటే నష్టాలతో నడిబజారున పడుతారు. అలా నష్టాలతో దివాళా తీసిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు.
Video Advertisement
సినీ రంగంలో స్థిరపడాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి వస్తుంది. తాజాగా హీరో రానా దగ్గుబాటి బాహుబలి సినిమాలను నిర్మించడం కోసం ఆర్కా మీడియా డబ్బు విషయంలో ఎలాంటి రిస్కులు చేసిందో వెల్లడించారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీ భారతీయ సినీ ఇండస్ట్రీ తీరుతెన్నులను ఒక్కసారిగా మార్చివేసింది. సినీ హిస్టరీలో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోయింది.
అయితే ఈ చిత్రాలకు ఊహించని స్థాయిలో ఖర్చు అయ్యింది. ఈ మూవీ కోసం ప్రొడ్యూసర్స్ 400 కోట్లు అప్పు చేశారని ఇటీవల రానా చెప్పుకొచ్చారు. 3, 4 ఏళ్ల క్రితం చిత్రాలకు డబ్బులు పెట్టాలంటే ప్రొడ్యూసర్ తన ఇంటి నుంచి, లేదా బ్యాంకులలో ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు వడ్డీకి తీసుకొచ్చేవారని రానా అన్నారు. గతంలో 24-28 శాతం వడ్డీ కట్టేవాళ్లమని చెప్పారు.బాహుబలి 1,2 చిత్రాల కోసం 300-400 కోట్లు 24 శాతం వడ్డీకి అప్పుగా తీసుకువచ్చారని రానా అన్నారు. బాహుబలి 1 సమయంలో చాలా ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నామని చెప్పారు. ఆ సమయంలో నిర్మాతలు 180 కోట్ల రూపాయలు 24 శాతం వడ్డీకి అప్పు చేశారని చెప్పుకొచ్చారు. బాహుబలి ఆడకపోతే ఆ కండిషన్ ను ఊహించుకోవడం కూడా కష్టమని రానా అన్నారు.
Also Read: “గుంటూరు కారం” వీడియోలో మహేష్ బాబుతో పాటు ఉన్న… మరొక హీరోని గుర్తుపట్టారా..? అస్సలు గమనించలేదే..?
End of Article