Ads
లెజెండరీ స్టార్ హీరోల చివరి సినిమాలు చిరస్మరణీయం కావాలని కోరుకుంటారు కానీ ఒక్కోసారి అనూహ్యంగా ఇవి కొత్త మలుపులు తీసుకుంటాయి. ఉదాహరణకు అక్కినేని నాగేశ్వరరావు గారి ఆఖరి చిత్రం మనం. అయితే నలభై ఏళ్ళు ల్యాబ్ లో మగ్గిపోయిన ప్రతిబింబాలు లాస్ట్ మూవీ అయ్యింది.
Video Advertisement
ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ వంతు వచ్చింది. ఆయన ఆఖరిగా తెరమీద కనిపించిన సినిమా శ్రీశ్రీ. ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫ్యాన్స్ కి గుర్తే. కానీ ఇప్పుడు వేరే చిత్రం తెరపైకి వచ్చింది. 2007లో షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
శాండల్ వుడ్ లో పేరున్న హెచ్ మధుసూదన్ దర్శకత్వం వహించారు. రకరకాల కారణాల వల్ల ల్యాబ్ నుంచి బయటికి రాలేదు. ఇన్నేళ్లు బయటికి తీసుకొచ్చే చొరవ ఎవరూ చేయలేదు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కృష్ణ జయంతిని పురష్కరించుకుని మే 31న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి శ్రీపాద్ హంచాటే నిర్మాత. ‘2007లో సినిమా పూర్తయింది, ఇన్నాళ్లకు నేనే సొంతంగా విడుదల చేస్తున్నాను’ అని డైరెక్టర్ మధుసూదన్ తెలిపారు. మొదట దీనికి ‘ప్రేమ చరిత్ర’ అని టైటిల్ పెట్టారు. ఇప్పుడు 16 ఏళ్ల తరవాత ఈ సినిమాను ‘కృష్ణ విజయం’ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్‌ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కృష్ణ పర్సనల్ మేకప్‌మేన్ మాధవరావు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యశ్వంత్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రంలో మెగాబ్రదర్ నాగబాబు, అలీ, ఎమ్మెస్ నారాయణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి యం.యం.శ్రీలేఖ సంగీతం సమకూర్చారు.
End of Article