Ads
ఒక సినిమాకి హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వీటితో పాటు ఇంపార్టెంట్ అయినది ఒక డైరెక్టర్, ఇంకా ఆ డైరెక్టర్ విజన్. ఆ డైరెక్టర్ టేకింగ్ ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది అనే విషయం మన అందరికీ తెలుసు. ప్రతి డైరెక్టర్ కి ఒక డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది. కథని ట్రీట్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి కథ మామూలుదే అయినా కూడా డైరెక్టర్ టేకింగ్ వల్ల సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.
Video Advertisement
ఒక డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుందో చెప్పడానికి మూడు సంవత్సరాల క్రితం వచ్చిన రంగస్థలం సినిమా, ఆ సినిమాలోని ఒక సీన్ ఒక ఉదాహరణ. అదేంటంటే. హీరో చిట్టిబాబు పాత్రకి చెవులు సరిగ్గా వినపడవు. అవతలి వాళ్ళు చెప్పే వాటిని లిప్ మూమెంట్ బట్టి అర్థం చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ అన్నయ్య ఒకసారి చెవికి మిషన్ పెట్టించినా కూడా ఒకవేళ మిషన్ పెట్టుకుంటే తనకు వినపడదు అనే విషయం అందరికీ తెలిసిపోతుంది అని మిషన్ పెట్టుకోడు చిట్టిబాబు.
మధ్యలో ఒకసారి హీరోయిన్ వచ్చి హీరోతో మాట్లాడుతుంది. అప్పుడు హీరోకి హీరోయిన్ మాట్లాడిన మాటలు తప్పుగా అర్థం అయ్యి ఆమెపై కోపం తెచ్చుకుంటాడు. తర్వాత కుమార్ బాబుని ఎవరో చంపేస్తారు. అప్పటి నుంచి చిట్టిబాబు మిషన్ పెట్టుకోవడం మొదలుపెడతాడు.
అయితే కుమార్ బాబుని చంపిన వాళ్ళని చిట్టిబాబు అలాగే ఒక జాతరలో ఒక అతని లిప్ మూమెంట్ చూసి కనుక్కుంటాడు. అయితే మనం ఒకసారి గమనిస్తే కుమార్ బాబు చనిపోయే ముందు ఆ వ్యక్తి పేరు చెప్తూ ఉంటాడు. కానీ చిట్టిబాబుకి సరిగ్గా అర్థం అవ్వదు. అంటే కేవలం లిప్ మూమెంట్ మాత్రమే చూస్తే సరిగ్గా అర్థం అవ్వదు.
అందుకు హీరోయిన్ తో జరిగిన కాన్వర్జేషన్ అలాగే కుమార్ బాబు తో జరిగిన ఈ సీన్ అనేది ఒక ఉదాహరణ లాగా చూపించారు డైరెక్టర్. మిషన్ పెట్టుకొని లిప్ మూమెంట్ చూస్తే అప్పుడు చిట్టిబాబుకి కరెక్ట్ గా అర్థం అవుతుంది అని జాతరలో ఒక డాన్సర్ లిప్ మూమెంట్ లో వచ్చిన శ్రీమన్నారాయణ అనే పేరుని తన అన్నయ్య చెప్పిన పేరుతో మ్యాచ్ చేసుకున్నాడు అని చూపించాడు డైరెక్టర్.
End of Article