“ఆదిపురుష్” ‘ప్రీ-రిలీజ్’ ఈవెంట్ కి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా..? కేవలం బాణాసంచా కోసమే..??

“ఆదిపురుష్” ‘ప్రీ-రిలీజ్’ ఈవెంట్ కి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా..? కేవలం బాణాసంచా కోసమే..??

by Anudeep

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా.. సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు. మొదటి నుంచి ఎన్నో అంచనాలు నెలకొన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

 

 

ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం జూన్ 16న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ని వేగవంతం చేసారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ తో ఈ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

aadipurush movie pre release event cost..!!

ఇక తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక తిరుపతిలో జరిగింది. ఎస్వీ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరిగింది. రామాయణం ఆధారంగా తెరకెక్కడం వల్ల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆధ్యాత్మిక నగరి తిరుపతిని ఎంచుకుంది యూనిట్. దీనికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన జీయర్ స్వామి హాజరయ్యారు. ఈ ఈవెంట్ ని శ్రేయాస్ మీడియా నిర్వహించింది. దీన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ పర్యవేక్షించారు.

aadipurush movie pre release event cost..!!

తిరుపతిలో జరిగిన ఈ ఈవెంట్ కోసం మూడు కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కేవలం ఇందులో పేల్చిన బాణసంచా కోసమే రూ.50 లక్షలు ఖర్చు చేశారట. అది హీరోయిన్ కృతి సనన్ పారితోషికానికి సమానం అని సమాచారం. ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. ప్రమోషన్ల కోసం కూడా మేకర్స్ భారీగానే ఖర్చు చేస్తున్నట్లు దీనిని చూస్తే స్పష్టమవుతోంది. తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకకు వేలాది మంది ప్రభాస్ అభిమానులు తరలి వచ్చారు.

aadipurush movie pre release event cost..!!

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ను రాముడి లుక్ లో చూడటాన్ని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Also read: “ఎన్ని రోజులు అయింది మన డార్లింగ్ ని ఇలా చూసి..?” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై 15 మీమ్స్..!


End of Article

You may also like