Ads
రామాయణం ఆధారంగా రూపొందిన భారీ సినిమా ‘ఆదిపురుష్’. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ యూనిట్ ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా మూవీ ప్రమోషన్స్ ను వినూత్నంగా నిర్వహిస్తున్నారు.
Video Advertisement
ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా
ఫైనల్ ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ ట్రైలర్ చూసినవారు రామాయణంను తప్పుగా చూపించారని అంటున్నారు. కానీ కొందరు ఆదిపురుష్ లో చూపించిందే కరెక్ట్ అంటూ ట్విట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా నటిస్తున్నారు. లంకేశ్వరుడు రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను తిరుపతిలో నిర్వహించారు. ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుండి సోషల్ మీడియా అంతా ఆదిపురుష్ వార్తలతో నిండిపోయింది.
ఈ ట్రైలర్ లో రావణాసురుడు సీతాదేవిని అపహరించిన విధానాన్ని చూసి, రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆదిపురుష్ కి మద్ధతుగా రామానంద్ సాగర్ రూపొందించిన రామాయణంలోని రావణుడు సీతను అపహరించే వీడియోను, ఆదిపురుష్ లో అదే సన్నివేశాన్ని పొలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.
సీరియల్ లో రావణాసురుడు సీతాదేవిని బలవంతంగా ఎత్తుకెళ్లాడు. కానీ ఆదిపురుష్ లో రావణాసురుడు సీతాదేవిని టచ్ చేయకుండా తీసుకెళ్లాడు. దీనిని అందరు తప్పుగా చూపించారని అంటున్నారు. సీరియల్ తో పోలిస్తే ఆదిపురుష్ కరెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే సీతమ్మను ఎవరు టచ్ చేయలేరని కామెంట్స్ పెడుతున్నారు.
watch video :
End of Article