ఈ కారణం వల్లే ఆదిపురుష్ టీమ్ ఇంటర్వ్యూ లకి దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యారా..?

ఈ కారణం వల్లే ఆదిపురుష్ టీమ్ ఇంటర్వ్యూ లకి దూరంగా ఉండాలి అని డిసైడ్ అయ్యారా..?

by kavitha

Ads

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన మైథాలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమా మరో ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందనే విషయం తెలిసిందే.

Video Advertisement

హీరో ప్రభాస్ అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో కూడా ఆదిపురుష్ మూవివ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, మూవీ టీమ్ మీడియా ఇంటరాక్షన్స్ మరియు ఇంటర్వ్యూలకు దూరంగా ఉండాలని నిర్ణయం  తీసుకున్నారట. దానికి కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ మొదటిసారి శ్రీరాముడి పాత్ర పోషించిన  పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి  తరచు ఈ మూవీ పై ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పుడు కార్టూన్ సినిమా అని ట్రోల్స్, కామెంట్స్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో ఈ మూవీ పై విపరీతమైన నెగటివిటి స్ప్రెడ్ అయ్యింది. దీంతో మేకర్స్ విజువల్స్ గ్రాఫిక్స్ పై మరింత దృష్టి పెట్టారు. ఈ కారణంగానే సినిమా రిలీజ్ చాలా ఆలస్యమైంది.
ఆ తరువాత రిలీజ్ చేసిన ట్రైలర్ తో విమర్శలు కాస్త తగ్గాయి. కానీ రామాయణాన్ని తప్పుగా చూపించారని మరోసారి ఆదిపురుష్ పై వివాదం మొదలైంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా గ్రాండ్ గా నిర్వహించింది. ఆదిపురుష్‌ చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌ని వినూత్నంగా చేసింది. మూవీ రిలీజ్ అయిన థియేటర్లలో ఒక్క సీట్ హనుమంతుడికి కేటాయించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఆదిపురుష్ మూవీ టీమ్ మాత్రం  మీడియా ఇంటరాక్షన్‌లు మరియు ఇంటర్వ్యూలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. aadipurush movie తమ చిత్రం చుట్టూ వివాదాలు రాకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లేదా ఇంటర్వ్యూలలో అడిగే కొన్ని ప్రశ్నలు వివాదానికి దారి తీస్తుండడం తెలిసిందే. అందువల్ల ఈ చిత్రం విడుదలయ్యే వరకు ఆదిపురుష్ టీమ్ నుండి ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవని తెలుస్తోంది. తమ మూవీకి ఎలాంటి వివాదాలు రాకుండా చేయడం కోసం ఆదిపురుష్ టీమ్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.

https://www.instagram.com/p/CtOFJgnJQWR/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: లవకుశ సినిమాలో “అంజలీదేవి” నుండి ఆదిపురుష్ సినిమాలో “కృతి సనన్” వరకు… సినిమాల్లో “సీతా దేవి” పాత్రలో నటించిన 8 హీరోయిన్స్..!


End of Article

You may also like