Ads
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం… ఆలయం వెలుపల కథానాయిక కృతి సనన్ని, ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ముద్దు పెట్టడం, కౌగిలించుకోవడం విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతిలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత ఓం రౌత్, కృతి సనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Video Advertisement
దర్శనం అనంతరం కృతి సనన్ వెళ్లిపోతున్నా సమయంలో ఓం రౌత్ ని కౌగిలించుకోవడం, ఓం రౌత్ ఆమెకు ముద్దు ఇవ్వడం పై భక్తులు ఫైర్ అవుతున్నారు. తాజాగా ఈ విషయం పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వామివారి శేష వస్త్రాలు ధరించి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులు చేయడం తన మనసుకి ఆందోళన కలిగించిందన్న రంగరాజన్.. తిరుమల కొండ పై అటువంటి వికారమైన చేష్టలు చేయకూడదని, అది శాస్త్ర సమ్మతం కాదని చెప్పుకొచ్చారు. తిరుమల కొండకు వచ్చినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు సైతం వారి ఆలోచనా విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించిన రంగరాజన్.. ఓం రౌత్ చేసిన పనిని తీవ్రంగా తప్పుబట్టారు.
భార్యాభర్తలు కలిసి వచ్చినా, వారు కళ్యాణోత్సవంలో పాల్గొన్నా ఆలోచనా విధానంలో వారు జాగ్రత్త పడతారని, వికారమైన ఆలోచనలు రాకుండా ఉండేలా చూసుకుంటారని ఆయన తెలిపారు. అలాంటి ప్రదేశంలో బహిరంగంగా కౌగిలించుకోవడం చాలా దారుణమని విమర్శించారు. ఇప్పటికే కృతి సనన్, ఓం రౌత్‌పై ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కూడా స్పందించారు.
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. ఆదిపురుష్’ సినిమా టీజర్ విడులైనప్పటి నుంచీ వివాదాస్పదమైంది. ఇప్పటి వరకు రామాయణంలో పాత్రలను చూసిన ప్రేక్షకులు.. ఈ సినిమాలోని పాత్రలను స్వీకరించలేకపోయారు. ఈ క్రమంలో తిరుమలలో కృతి సనన్, ఓం రౌత్ ప్రవర్తన మరోసారి ఈ సినిమా వివాదంలో చిక్కుకునేలా చేసింది.
watch video :
End of Article